English | Telugu

సీత స్టాండ్ తీసుకుంది కరెక్టే.. నబీల్ కి తెలియని స్ట్రాటజీ అదే!

బిగ్ బాస్ సీజన్-8 లో ఆరో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక ఈ వారం మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. వారిలో కొత్త కంటెస్టెంట్స్ గంగవ్వ, మెహబూబ్ కూడా ఉన్నారు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఫుల్ ఫైర్ లో రాకుండా కూల్ గా కన్పించారు. దాంతో హౌస్ మేట్స్ కాస్త నార్మల్ అయ్యారు. ఇక వచ్చీ రాగానే మణికంఠను మెనీ కంఠ అంటూ ఏదో చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత విష్ణుప్రియ లేపి ఏదో అడుగబోతుంటే.. వారం మొత్తం టాస్క్‌లో ఇరగదీసి పర్ఫామ్ చేసేసరికి అలిసిపోయా సర్ అని విష్ణుప్రియ అంది. అబ్బో ఏం చేసి అలిసిపోయావని నాగార్జున అనగానే.. హోటల్ టాస్క్ లో మసాజ్ చేసి.. కాళ్ళు నొక్కాను సర్.. చాలా కంటెంట్ ఇచ్చాను సర్ అని విష్ణుప్రియ తన బాధ చెప్పింది. అంతేనా... లేదంటే పృథ్వీ మాల్దీవ్స్ ఆఫర్‌ రిజిస్టర్ కాలేదనా? అని నాగార్జున అడిగాడు. అప్పుడు పృథ్వీ లేచి నిలబడి.. విష్ణూ నీకు చెప్పాను కదా.. పెళ్లి చేసుకుని మల్దీవ్స్ వెళ్దాం అన్నా కదా అని విష్ణుప్రియకి నాగార్జున గుర్తుచేశాడు. ఆ తర్వాత.. అవినాష్, టేస్టీ తేజాలు గులాబ్ జామ్‌లు తిన్న వీడియోను చూపించి.. వాళ్లతో గులాబ్ జామ్‌లను తినిపించాడు నాగార్జున. కొన్ని తిన్నాక వాళ్ళు వదిలేశారు. ఇక వాళ్ళు గులాబ్ జామ్ లు దొంగచాటుగా తినకుంటే మీ టీమ్ గెలిచేది కదా అని నబీల్ ని నాగార్జున అడుగగా.. రెండు తిన్నామని చెప్పారు సర్ అని నబీల్ చెప్పుకొచ్చాడు.

సీత రాయల్స్ టీమ్ దగ్గర దొంగతనం చేయడాన్ని.. తప్పు పట్టి ఆమెతో బలవంతంగా డబ్బులు ఇప్పించారు. ఆమె చేసింది తప్పే కాదని నాగార్జున అన్నాడు. సీత డబ్బులు ఇవ్వడం వల్లే.. ఆ టీమ్ గెలిచింది.. రాయల్స్ టీమ్ వాళ్లు ప్లాన్ చేసి.. సీత దగ్గర డబ్బులు తీసుకుంటేనే గెలుస్తామని వాళ్లకి తెలుసు.. అందుకే ఆ డబ్బులు తీసుకున్నారు. కానీ ఓజీ టీమ్ మాత్రం వాళ్లు అడగ్గానే ఇచ్చేశారు. అయిన సీత తీసుకున్న స్టాండ్ మీద నిలబడి ఉంటే.. ఆ టీమ్ గెలిచేది. నువ్వు మీ టీమ్ మాట విని మిస్టేక్ చేశావ్.. నీ స్టాండ్ మీద నిలబడి ఉంటే మీ టీమ్ గెలిచేది అని సీతతో నాగార్జున చెప్పి.. ఆ తర్వాత నబీల్‌‌కి నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ చెప్పనంతవరకూ అది ఫెయిర్ కిందే లెక్క.. ఇది గుర్తుపెట్టుకుని ఆట ఆడండి అని నాగార్జున గైడెన్స్ ఇచ్చాడు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.