ఈ వారం నాలుగు సినిమాలు.. మీ ఓటు దేనికి..?
ఎన్నికల హడావుడి కారణంగా ఈ వేసవిలో టాప్ స్టార్ల సినిమాల సందడి లేదు. ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే విడుదలవుతున్నాయి. ఈవారం నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రేపు(మే 3న) 'ఆ ఒక్కటీ అడక్కు', 'ప్రసన్న వదనం', 'శబరి', 'బాక్' సినిమాలు విడుదలవుతున్నాయి.