60 కోట్లు పెడితే 10 కోట్లు వచ్చాయి..మరి ఓటిటికి ఎప్పుడు
శ్రీదేవి(Sridevi)చిన్నకూతురు ఖుషి కపూర్(Khushi Kapoor)జునైద్ ఖాన్(Junaid Khan)జంటగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'లవ్ యాపా'(Loveyapa).అద్వైత్ చందన్(Advait Chandan)దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్,ఫాంటమ్ స్టూడియోస్ పై కల్పతి ఎస్. అఘోరం,కల్పతి ఎస్. గణేష్,కల్పతి ఎస్.సురేష్,మధుమంతెన,భావన తల్వార్,శ్రుష్టి బెహల్ ఆర్య నిర్మించగా ఫిబ్రవరి 7 న హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హిట్ మూవీ 'లవ్ టుడే'కి రీమేక్ గా తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.