Read more!

English | Telugu

విక్రమార్కుడు 2 అయిపోయింది..సరైన క్యాస్టింగ్ దొరకడం లేదు

సినిమాకి ప్రత్యేకంగా దేవుడు లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే సినీ ప్రేమికులు ఇప్పుడు సినీ మార్కెట్ లో వస్తున్న ఒక న్యూస్ చూసి ఆ సినిమా త్వరగా రావాలని మొక్కుకునే వాళ్ళు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆనందంతో పులకరించి పోతున్నారు. ఆ న్యూస్ వింటే మీరు కూడా  ఆనందపడతారు. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

2006 లో మాస్ మహారాజా రవితేజ, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో లో  విక్రమార్కుడు వచ్చింది. రావడమే కాదు తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది. పైగా ఇంకో  విషయం ఏంటంటే జక్కన్న,రవితేజ ల  సినీ కెరీర్ జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్లిపోయేలా చేసింది. మరి ఇలాంటి ట్రెండ్ సెట్ మూవీకి సీక్వెల్ ఉంటుందనే వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి. తాజాగా ఆ విషయంపై  ప్రొడ్యూసర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. విక్రమార్కుడు 2 స్క్రిప్ట్ ని  రైటర్ విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేసారు. సరైన కాస్టింగ్ దొరికితే  షూట్ కి వెళ్తామని చెప్పాడు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరి ఈ  సీక్వెల్  లో రవితేజ ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.  డైరెక్షన్  కూడా  జక్కన్న చేస్తాడా లేక వేరే వాళ్ళు చేస్తారా అనేది తెలియాలి. దొంగగా, పోలీసుగా రవితేజ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మూవీలోని ఆయన ఊతపదం జింతాక్ జింతాక్ నేటికీ కుర్ర కారు నోటి వెంట వినపడుతూనే ఉంది. అనుష్క  హీరోయిన్ గా చెయ్యగా  బ్రహ్మనందం, రాజీవ్ కనకాల, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజయ్ విలన్ గా చేసాడు.  కీరవాణి సంగీతాన్ని అందించాడు