English | Telugu

‘కంచె’ ట్రైలర్..మెగా హీరో కేక పెట్టించాడు

గన్ను పట్టుకుని కదన రంగంలో చెలరేగిపోయాడు వరుణ్ తేజ్. రెండు నిముషాలు సాగే ‘కంచె’ ట్రైలర్ తోనే వావ్ అనిపించాడు క్రిష్. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో అల్లిన ఈ ప్రేమకథ అటు గగుర్పొడిచే యుద్ధ సన్నివేశాలతో, ఇటు మనసుని హత్తుకునే ప్రేమ సన్నివేశాలతో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ట్రెయిలర్‌ చూస్తేనే కలుగుతోంది. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రెయిలర్‌ని కొద్ది సేపటి క్రితం రాజమౌళి తన ట్విట్టర్‌ పేజీ ద్వారా రిలీజ్‌ చేశాడు.ఎప్పటికప్పుడు కొత్త కథాంశాలతో ముందుకి వచ్చే క్రిష్‌ ఈసారి కూడా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాన్ని ఎంచుకుని సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు. వరుణ్‌ తేజ్‌ ఆ కాలం నాటి లుక్‌లో చూడ్డానికి బాగుండడమే కాకుండా, నటుడిగాను రాణించాడని ట్రెయిలర్‌ని బట్టి తెలుస్తోంది. ట్రైలర్ ద్వారా కంచె కథ తెలియాలంటే అక్టోబర్ 2న థియేటర్ లో చూడమని చెప్పకనే చెప్పాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.