English | Telugu

లోఫ‌ర్ ... ముందే లాస్

ఏ సినిమా అయినా క‌నీస లాభాల‌తో విడుద‌ల చేసుకోవాల‌ని నిర్మాత భావిస్తుంటాడు. లాభాలు లేక‌పోయినా.. లెక్క‌ల‌న్నీ సెట్ చేసేస్తే చాల‌నుకొంటాడు. అయితే ఈ రోజుల్లో ఇవి రెండు క‌ల‌లుగానే మిగిలిపోతున్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా విడుద‌లు ముందు కుస్తీలు ప‌డాల్సిందే. ఇప్పుడు లోప‌ర్ కీ అదే జ‌రుగుతోంది. ఈ సినిమా ఈనెల 17న విడుద‌ల కాబోతోంది.

పూరి జ‌గన్నాథ్ సినిమా, దానికి తోడు మెగా హీరో ఉన్నాడు, అన్నింటికి మించి మాస్ టైటిల్‌. అయినా స‌రే... బిజినెస్ జ‌ర‌గ‌లేదు. చాలా ఏరియాల నుంచి బ‌య్య‌ర్లు కొన‌డానికి ముందుకు రాలేదు. ఓవ‌ర్సీస్ బిజినెస్ అస్స‌లు వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. దాంతో డెఫ్‌షీట్‌తో ఈ సినిమా విడుద‌ల కావాల్సివ‌స్తోంది. క‌నీసం రూ.10 కోట్లు ముంద‌స్తుగా వ‌దులుకొని.. కేవ‌లం థియేట‌ర్ల అడ్వాన్సులు తీసుకొని ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నార్ట‌.

నిజానికి మ‌రో నిర్మాత అయినా ఆ సాహ‌సం కూడా చేయ‌క‌పోదుడు. ఈనెల 17న విడుద‌ల చేయ‌క‌పోతే.. వ‌చ్చే యేడాది పిబ్ర‌వ‌రి వ‌ర‌కూ ఆగాల్సిన ప‌రిస్థితి. ఈలోగా లోఫ‌ర్ గురించి జ‌నం మ‌ర్చిపోతారు. అందుకే ఏదైతే అది అయ్యింద‌నుకొని.. లోఫ‌ర్‌ని రెడీ చేశారు... 10 కోట్ల న‌ష్టంతో. అదీ.. పూరి జ‌గ‌న్నాథ్ దుస్థితి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.