English | Telugu

Turbo movie review: టర్బో మూవీ రివ్యూ

Turbo movie review: టర్బో మూవీ రివ్యూ

 

మూవీ : టర్బో
నటీనటులు: మమ్ముట్టి, రాజ్ బి శెట్టి,  శబరీశ్, అంజనా జయప్రకాశ్, సునీల్ తదితరులు
రచన : మిథున్ థామస్
ఎడిటింగ్: షమీర్ మహమ్మద్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
మ్యూజిక్: క్రిస్టో సేవియర్
నిర్మాతలు: మమ్ముట్టి
దర్శకత్వం: వైశాఖ్
ఓటీటీ : సోనిలివ్

మమ్ముట్టి నిర్మాతగా నటుడిగా చేసిన సినిమా ' టర్బో‌'. ఈ ఏడాది వేసవికాలం మలయాళంలో రిలీజైన‌ ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక సోనిలివ్ లోకి తెలుగు‌ డబ్బింగ్ తో వచ్చేసింది. మరి ఈ మూవీ కథేంటో ఓ సారి  చూసేద్దాం...

కథ :

జోస్ (మమ్ముట్టి) ఒక గ్రామంలో తన తల్లితో కలిసి నివసిస్తుంటాడు. అతని స్నేహితుడే జెర్రీ (శబరీశ్) చెన్నైలోని ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. అదే సిటీలో మరో బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్న ఇందులేఖ (అంజనా జయప్రకాశ్)తో జెర్రీ ప్రేమలో పడతాడు. ఆమె తల్లిదండ్రులు .. చెల్లెలు ఆ పక్కనే ఉన్న ఊళ్లో ఉంటారు. ప్రతి ఏడాది వారి ఊళ్లో జరిగే జాతరలో జోస్ ఊళ్లో గొడవలు జరుగుతుంటాయి. అందువలన జోస్ ను వేరే ఊరికి పంపించాలని తల్లి అనుకుంటుంది. అయితే ఒక రోజు జెర్రీ ఓ ముఖ్య విషయం ఇందులేఖకి చెప్పడానికి వెళ్తుండగా అతను అనుమానాస్పద రీతిలో చనిపోతాడు.  జెర్రీ మరణం ఇందులేఖ డిప్రెషన్ లోకి వెళ్తుంది‌. అదే సమయంలో ఆమెపై ఎటాక్ జరుగుతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారనే ఆలోచన జోస్ ను సతమతం చేస్తుంటుంది. అదే సమయంలో జెర్రీతో పాటు కలిసి బ్యాంకులో పనిచేసిన సితార వస్తుంది. 100 కోట్ల బ్యాంకు స్కామ్ గురించి ఇందులేఖతో చెబుతుంది. జెర్రీ చావుకు వెనుక ఏదో ఉందని అనుకుంటుంది. అసలు షణ్ముగ సుందరం ఎవరు? అతను ఏం చేస్తుంటాడు? తన‌ స్నేహితుడి మరణానికి కారణమైందెవరో కనిపెట్టాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

కథ ఓ మర్డర్ తో మొదలవుతుంది. ఇక ప్రతీ ప్రేక్షకుడు అసలు ఆ మర్డర్ ఎవరు చేపించారు? ఎవరా జోడి అనే క్యూరియాసిటిని ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది. 

కామెడీ ప్లస్ యాక్షన్ తో కూడిన మమ్ముట్టి జోస్ పాత్రకు అందరు‌ కనెక్ట్ అవుతాడు.  డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో విలన్ పాత్రను  డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. ఎక్కడా సినిమాటిక్ గా కాకుండా చాలా సహజంగా కథ మలుపులు తీసుకుంటూ ఉంటుంది. ఈ కథలో మమ్ముట్టికి జోడీగా ఎవరూ ఉండరు .. అలాగని ఆ లోటు కూడా తెలియదు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ వరుస ట్విస్టులను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

సినిమాలో కొన్ని అనవసరపు సీన్లు కూడా ఉన్నాయి. పాత్రలని సహజ సిద్ధంగా చూపించడం కోసం దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. 

సినిమాలో హీరోతో పాటు విలన్ కి అత్యధిక స్క్రీన్ స్పేస్ లభించింది. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలసి చూసేలా ఈ సినిమాని మేకర్స్‌ రూపొందించారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, క్రిస్టో సేవియర్ బిజిఎమ్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 

జోస్ గా మమ్ముట్టి ఒదిగిపోయాడు. జెర్రీ పాత్రలో శబరీశ్,‌ ఇందులేఖగా అంజనా జయప్రకాశ్, షణ్ముగ సుందరంగా రాజ్ బి శెట్టి ఆకట్టుకున్నారు. ‌ఇక మిగతా పాత్రలు వారి పరిధి మేర‌ నటించారు.

ఫైనల్ గా : కొన్ని సీన్ల కోసం, యాక్షన్ సీక్వెన్స్ కోసం ఓ సారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2.5 / 5