English | Telugu

ప్రముఖ హీరోయిన్ ని దుబాయ్ లో అమ్మకానికి పెట్టారా! 

ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను(taapsee pannu)ప్రస్తుతం నటిగా తన సత్తా చాటుతూ ముందుకు దూసుకుపోతుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోను చేస్తు ఒక రేంజ్ లోనే బిజీగా ఉంది. షారుక్, రాజ్ కుమార్ హిరానీ లాంటి లెజండ్స్ కాంబోలో వచ్చిన డంకీ లోను హీరోయిన్ గా చేసి తన రేంజ్ ఏ పాటిదో చెప్పకనే చెప్పింది. తాజాగా ఆమె కొన్ని ఆసక్తి కరవ్యాఖ్యలు చేసింది.

తాప్సీ లేటెస్ట్ గా అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న ఖేల్ ఖేల్ మే(khel khel me)లో ఒక ముఖ్య పాత్రలో చేస్తుంది. ఈ నెల 15 న విడుదల కాబోతుండగా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.వాటిల్లో తాప్సి కూడా పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతు నేను నా హస్బెండ్ ని 2013 లో మొదటి సారి కలుసుకున్నాను. ఆ తర్వాత తనతో డేటింగ్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు నన్ను దుబాయ్ కి రమ్మని ఆహ్వానించాడు.ఆ విషయాన్నీ నా స్నేహితురాలితో షేర్ చేసుకున్నాను. అప్పుడు తను చెప్పిన మాట ఈ రోజుకి నాకు గుర్తు ఉంది. నిన్ను దుబాయ్ లో అమ్మేస్తాడేమో జాగ్రత్త అని చెప్పింది. అంతే కాకుండా దుబాయ్ లో ఉంటున్న తన అక్క నంబర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు తాప్సీ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

తాప్సీ హస్బెండ్ పేరు మథియాస్ బో(mathias boe) డెన్మార్క్‌కు చెందిన మథియాస్ బ్యాడ్మింటన్ రంగంలో విశేష కీర్తిని సంపాదించాడు.. 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించడంతో మొదలైన తన విజయ ప్రస్థానం అంచెలంచెలుగా సాగింది. 2012, 2015,2017 లో యూరోపియన్ ఛాంపియన్‌గా నిలవడంతో పాటు బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. 2016 చైనాలోని కున్షాన్‌లో జరిగిన థామస్ కప్‌లో కూడా విజేత గా నిలిచాడు.ఈ సంవత్సరం మార్చి లోనే తాప్సి, మథియాస్ ల వివాహం జరిగింది.


రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.