English | Telugu
త్రివిక్రమ్ కాపీ కొట్టేస్తున్నాడా??
Updated : Aug 12, 2015
త్రివిక్రమ్‌కి దర్శకుడి కంటే.. `రచయిత`గానే ఎక్కువ గుర్తింపు. త్రివిక్రమ్ పంచ్‌లకూ, అతని లోతైన మాటలకూ పడిపోని ప్రేక్షకుడు లేడు. అయితే రచయితగా అతని పెన్ను పదును ఈమధ్య కాస్త తగ్గింది. కొత్త కథలు ఎంచుకొంటే గానీ... మళ్లీ త్రివిక్రమ్ విశ్వరూపం చూడలేమని ఆయన అభిమానులూ ముక్తకంఠంతో చెబుతున్నారు. అందుకే ఇప్పుడో కొత్త కథని `వెదికి` పట్టుకొన్నాడట.
నితిన్ - సమంత కాంబినేషన్లో త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ కథకు స్ఫూర్తి ఓ నవల అని తెలిసింది. ప్రముఖ రచయిత్రి కలం నుంచి జాలువారిన ఓ పాపులర్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. అయితే త్రివిక్రమ్ ఆ నవల పేరు బయటకు చెబుతాడా, లేదంటే కాపీ కొట్టేస్తాడా అన్నదే ఇప్పుడు డౌటుగా మారింది.
నవలలో పాయింటు ఆధారంగా చేసుకొని తనో కొత్త కథ రాశానని బిల్డప్ ఇచ్చినా ఇవ్వొచ్చు. పూరి జగన్నాథ్ జ్యోతిలక్ష్మి కూడా ఓ నవలకు ఆధారమే. మిసెస్‌పరాంకుశం అనే నవల ఆధారంగా జ్యోతిలక్ష్మి తెరకెక్కించాడు. ఆ క్రెడిట్ కూడా రచయితకు ఇచ్చాడు. మరి త్రివిక్రమ్ కూడా అదే చేస్తాడా, లేదంటే తెలివిగా ఆ క్రెడిట్ కూడా తనే కొట్టేస్తాడా.. చూడాలి మరి.