English | Telugu

70 కి.మీ. ప్రయాణించిన డ్రైవర్‌ లేని రైలు .. 14 ఏళ్ల క్రితమే ఈ ఘటనతో సినిమా!

హాలీవుడ్‌ సినిమాలను కొన్ని ఆసక్తికరమైన ఘటనల ఇన్‌స్పిరేషన్‌తో తీస్తూ ఉంటారు. ఆ సినిమాలు పెద్ద హిట్‌ అయిపోతూ ఉంటాయి. అలాంటి ఓ ఘటనతో దాదాపు 14 ఏళ్ళ క్రితం ‘అన్‌స్టాపబుల్‌’ అనే సినిమా వచ్చింది. కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్‌తో నిండి వున్న ట్రైన్‌ డ్రైవర్‌ చేసిన పొరపాటు వల్ల అతను లేకుండానే ప్రయాణిస్తుంటుంది. ఇదీ ఆ సినిమా కథ.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అదేమిటంటే ఒక గూడ్స్‌ రైలు డ్రైవర్‌ లేకుండానే కాశ్మీర్‌ నుంచి పంజాబ్‌ వరకు పరుగులు తీసింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ హ్యాండ్‌ బ్రేక్‌ వేయకుండానే బయటకు వెళ్లిపోయారు. పఠాన్‌ కోట్‌ వైపు రైల్వే ట్రాక్‌ వాలుగా ఉండటం, బోగీలు రాళ్ళ లోడుతో నిండి ఉండడం వల్ల రైలు ముందుకు కదిలింది. లోకో పైలట్‌ గమనించే లోపే ఆ రైలు వేగం పుంజుకొని ముందుకు దూసుకెళ్లింది. చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్‌ వద్ద చెక్క దిమ్మెలు, ఇతర వస్తువులు అడ్డు పెట్టి రైలును ఆపాల్సి వచ్చింది. ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్‌పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సాధారణంగా కొన్ని హాలీవుడ్‌ మూవీస్‌ను ఇలాంటి కథాంశాలతోనే నిర్మిస్తుంటారు. ఇప్పుడు జరిగిన ఈ ఘటన తరహాలోనే 14 ఏళ్ళ క్రితం సినిమా వచ్చిందంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ‘అన్‌స్టాపబుల్‌’ పేరుతో టోనీ స్కాట్‌ దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ సినిమా కథ మొత్తం ఒక ట్రైన్‌ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం జరిగిన సంఘటన మాదిరే.. అన్‌స్టాపబుల్‌ సినిమా కథ ఉంటుంది. ఇందులో కూడా ఇద్దరు రైల్వే ఉద్యోగులు చేసిన పొరపాటు వల్ల ట్రాక్‌ నుంచి కదిలిన ట్రైన్‌ ఆటోమెటిక్‌గా వెళ్లిపోతుంది. ప్రమాదకరమైన కెమికల్స్‌ ఉండడం వల్ల ఏ మాత్రం పొరపాటు జరిగినా భారీ విధ్వంసం జరగడం ఖాయం. లోకో పైలట్‌ లేకుండానే వేగం పెంచుకుంటూ గంటకు 100 కిలోమీటర్లతో దూసుకెళ్తుంది. ఆ సమయంలో ఎదురుగా 150 మంది పిల్లలతో ఒక ట్రైన్‌ వస్తుంది. ఇలాంటి సమయంలో ఆ విద్యార్థులు ఎలా బయటపడ్డారు..? అనేది ప్రధాన కథాంశం. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.