Read more!

English | Telugu

టైటానిక్ తలుపు, హీరోయిన్ బట్టలు వేలం..రేటు తెలిస్తే షాక్ అవుతారు

ప్రేమకి అసలైన  నిర్వచనాన్ని చెప్పిన మూవీ  టైటానిక్. 1997 వ సంవత్సరంలో వచ్చిన ఆ మూవీ ప్రపంచ సినిమా ఉన్నంత కాలం సినీ ప్రేమికుల మనసులో కదలాడుతూనే ఉంటుంది. ప్రపంచ సినీ ప్రేమికులని కూడా ఏకం చేసింది. తెలుగు నాట  చాలా కేంద్రాల్లో శతదినోత్సవాన్ని కూడా  జరుపుకుంది. నేటికీ ఆ సినిమాని ఇంటిల్లిపాది చూసే వాళ్ళు కోకొల్లలు. తాజాగా ఆ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది.

టైటానిక్  లో రోజ్ అండ్ జాక్  పాత్రల్లో  లియోనార్డో డికాప్రియో ( leonardo dicaprio)కేట్ విన్ స్లేట్ (kate winslet)లు చేసారు.పేద, ధనిక అనే  తారతమ్యం లేకుండా  ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కథానుసారం సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్ కూలిపోతుంది. దీంతో  ఎంతో మంది చనిపోతుంటారు. తన ప్రేయసి మాత్రం  చనిపోకూడదని  జాక్ భావిస్తాడు. దాంతో షిప్ లోని ఒక రూమ్ కి చెందిన  పెద్ద తలుపు పై రోజ్ ని ఉంచి ఆమె  ప్రాణాలని రక్షిస్తాడు. ఆ తర్వాత అతను మాత్రం నీటిలోనే  చనిపోతాడు.ఇప్పడు ఆ తలుపుని వేలం వేయడం జరిగింది.  7 , 18 ,750  డాలర్లకి అది  అమ్ముడుపోయింది. అంటే మన ఇండియన్ కరెన్సీ లో సుమారు  6 కోట్లు. దీంతో అత్యధిక రేటు సాధించిన వస్తువుగా హెరిటేజ్ ఆక్షన్ ట్రెజర్స్ లో అది నిలిచింది.ఇక రోజ్ ధరించిన ఫిషాన్ రకం  దుస్తులు కూడా 1 ,25000 డాలర్లు కి అమ్ముడుపోయాయి. అంటే  కోటి రూపాయలు. 

ప్రపంచ నెంబర్ వన్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో వచ్చిన  టైటానిక్ 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. 27  సంవత్సరాల క్రితమే  1250 కోట్ల రూపాయల బడ్జట్ తో నిర్మించారంటే టైటానిక్ ప్రాముఖ్యతని అర్ధం చేసుకోవచ్చు. ఇక అసలైన టైటానిక్ షిప్ నిర్మాణానికి  మాత్రం 47  కోట్లు ఖర్చు అయ్యింది. 1912 లో ఒరిజినల్ టైటానిక్ షిప్ సముద్రం లో మునిగిపోయింది..