Read more!

English | Telugu

ఈ నెలలో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, సిరీస్ లు!

ప్రతీ నెల ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందులో ఒక్కో కథ ఒక్కో జానర్ లో ఉంటుంది. అయితే వీటిల్లో ఫ్యామిలీతో కలిసి చూసేవి కొన్ని ఉంటే, ఇండివిడ్యువల్ గా చూసేవి మరికొన్ని ఉన్నాయి. అయితే ఏది ఏ ఓటీటీలో ఉంది. ఎలా ఉందో ఓసారి చూసేద్దాం.

ఈటీవి విన్ లో  మొదటగా విడుదలైన సినిమా ' వళరి '. రితిక సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ థ్రిల్లర్ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది‌. ఈ సినిమాలో ఫస్టాఫ్ అంతా కథలో కొత్తదనం, స్క్రీన్ ప్లే  బాగుండటం, ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటి బాగుంది. అయితే ద్వితీయార్థంలో వచ్చే సీన్స్, ట్విస్ట్ లు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.  ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన 'మెర్రీ క్రిస్మస్'. ఢిఫరెంట్ జానర్ ఫిల్మ్. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ఫ్రధాన పాత్రలుగా సాగే ఈ కామెడీ డ్రామా ఫిల్మ్ హిట్ టాక్ ని తెచ్చుకోలేకపోయింది. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ.  భిన్నమైన కథలని ఇష్టపడే వారికి నచ్చేస్తుంది.  స్క్రీన్ ప్లే బాగా స్లోగా ఉండటం, ల్యాగ్ సీన్లు, ఊహించే ట్విస్ట్ లు, నిడివి సినిమా బలహీనతలు ఉండటంతో యావరేజ్ గా నిలిచింది‌.  ఆ తర్వాత 'అన్వేషిప్పన్ కండేతుమ్' మలయాళం మూవీ. టోవినో థామస్ నటించిన ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అదిరిపోయే హిట్ ని సొంతం చేసుకుంది. ఒకే టికెట్టు పై రెండు సినిమాలు అన్నట్టుగా సాగే కథనం, ప్రథమార్ధంలో ఓ కేసు ఇన్వెస్టిగేషన్, ద్వితీయార్థంలో రెండో కేసు ఇన్వెస్టిగేషన్.. సాగడంతో ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులకి ఇంటెన్స్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ సాధించింది.

ది ఇంద్రానీ ముఖర్జీ స్టోరీ: బర్రీడ్ ట్రూత్ సిరీస్. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయి మిశ్రమ స్పందనలు తెచ్చుకుంది. యథార్థంగా జరిగిన కథలని జనరల్ గా అందరు చూస్తుంటారు. అందుకే ఇది ఓ వర్గాన్ని మాత్రం ఇంప్రెస్ చేసింది. ఆహా లో రిలీజైన ' మిక్స్ అప్ ' మూవీ.  ఫ్యామిలీతో ఏ విధంగాను చూడలేని సినిమా ఇది. రెండు పెళ్ళైన జంటలకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో ఓ సైకాలజిస్ట్ ని కలవడంతో వేకేషన్ కి వెళ్ళమనడం, ఆ తర్వాత అందరు గోవా ట్రిప్ కి వెళ్ళడం అక్కడ జరిగేది మిగతా స్టోరీ. ఇందులో మొత్తం యూత్ ని ఇంప్రెస్ చేయడానికే తీసినట్టుగా ఉంటుంది. 'మర్డర్ ముబారక్ ' నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది.  భారీ తారాగణం ఉన్నా స్లోగా సాగే కథనంతో ఆసక్తిగా ఉండదు. ' తుండు ' మలయాళం మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది‌. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.  ' అబ్రహం ఓజ్లర్'  జయరామన్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో కన్పించిన ఈ సస్సెన్స్ థ్రిల్లర్.. ఆ జానర్ సినిమాలని ఇష్టపడే వారికి బాగా కనెక్ట్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన ' సేవ్ ది టైగర్స్' సిరీస్. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. ‌అయితే ఈ నెలలో మీరు చూసిన, మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన కథేంటో కామెంట్ చేయండి.