English | Telugu
ట్విస్ట్ లతో థ్రిల్ ని పంచే క్రైమ్ సస్పెన్స్ మూవీ.. ఆక్రందన రివ్యూ!
Updated : May 20, 2024
కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులోను క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి మరీను. సాధారణంగా తెలుగు మూవీ లవర్స్ యూట్యూబ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీల కోసం వెతుకుతుంటారు. అందులో మోస్ట్ పాపులర్ అయినటువంటి మూవీలు కొన్ని ఉన్నాయి.
అర్జున్, ఆంటోని కలిసి నటించిన 'కిల్లర్' క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఇప్పుడు అదే కోవలోకి 'ఆక్రందన' మూవీ చేరింది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఈ మూవీ వచ్చి దాదాపు పది సంవత్సరాలైన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచింది. దర్శకుడు రూపేశ్ పీతాంబరన్ తీసిన ఈ మూవీ యూట్యూబ్ లో అత్యధికంగా వీక్షించిన సినిమాగా నిలిచింది. అసలు అంతలా హిట్ అవ్వడానికి కారణమేంటో తెలుసుకుందాం.
ఈ మూవీ 2012 లో 'తీవ్రం' పేరుతో మలయాళంలో రిలీజైంది. 2016 లో 'అతిరమ్' పేరుతో తమిళ్ లో రిలీజైంది. 2017 లో హిందీ వర్షన్ రిలీజ్ కాగా.. తెలుగులోను అదే సంవత్సరం ' ఆక్రందన ' పేరుతో వచ్చింది. ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం. ఓ ఇద్దరు ప్రేమికులు అర్థరాత్రి కారులో వెళ్తుంటారు. అందులో అమ్మాయికి విమానం చూడాలనిపిస్తుందంటే ఒక దగ్గర కార్ ని ఆపి బయటకొచ్చి చూస్తుంటారు. ఇక అప్పుడే ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి.. అతడిని తలపై బలంగా కొట్టి అమ్మాయిని తీసుకెళ్ళాలనుకుంటారు. అదేసమయంలో రోడ్డు మీద వెళ్తున్న మరొకతను వచ్చి వాళ్ళని సేవ్ చేస్తాడు. ఇక కొన్ని రోజులకు ఓ అమ్మాయిని ఆటో డ్రైవర్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాడు.ఆ అమ్మాయి ఒంటరిగా ఉండటం చూసి అతను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటాడు. రెగ్యులర్ గా తనని ఆటోలో పికప్ అండ్ డ్రాప్ చేస్తూ ఆ అమ్మాయిని మంచివాడని నమ్మిస్తాడు. ఒకరోజు తనకు పనిఉందని ఆటో ఎక్కగా.. అతను తనని అడవిలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఆ అమ్మయిని దారుణంగా రేప్ చేసి చంపేస్తాడు. ఆ అమ్మాయి తలని బాడీని వేరు చేసి అడవికి ఆనుకొని ఉన్న నదిలో పడేస్తాడు. మరుసటిరోజు ఉదయం ఆ ఏరియాలోకి పిల్లాడు రాగా అతనికి ఆ అమ్మాయి బాడీ కన్పిస్తుంది. ఆ విషయం పోలీసులకి చెప్పగా.. వాళ్ళు ఇంటరాగేషన్ మొదలెడతారు. అందులో నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అమ్మాయిని చంపిన ఆ ఆటో డ్రైవర్ ని పోలీసులు పట్టుకున్నారా? హీరో అతడికి శిక్ష వేశాడా లేదా అనేది మిగతా కథ. ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. 'తీవ్రం' అనే పేరుతో మలయాళంలో రిలీజైన ఈ సినిమా తెలుగులో 'ఆక్రందన' పేరుతో విడుదలైంది. సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఇది మాస్టర్ పీస్ గా నిలిచింది. మరి ఈ మూవీని మీరు చూశారా? చూడకపోతే ఒకసారి చూసేయ్యండి.
