Read more!

English | Telugu

విజయ్ దేవరకొండ మీద ట్రోలింగ్..డైరెక్టర్ చెప్పాడు అంటున్న ఫ్యాన్స్

 

సోషల్ మీడియా పుణ్యమా అని ట్రోలింగ్  మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. ఇక సినిమా వాళ్ళ మీద జరిగే ట్రోలింగ్ కి  అయితే మంచి గిరాకీ. తాజాగా హీరో  విజయ్ పై ట్రోలింగ్ జరుగుతుంది.ఏ విషయంలో అలా జరుగుతుందో చూద్దాం

విజయ్ దేవరకొండ (vijay devarakonda) హీరోగా వచ్చిన  ఫ్యామిలీ స్టార్ (family star) మొన్న ఏప్రిల్ 5 న థియేటర్స్ లో కి అడుగుపెట్టింది. కంటెంట్ లో ఉన్న లోపాల వల్ల పరాజయాన్ని చవి చూసింది. విజయ్ మాత్రం తన పరిధిలో బ్రహ్మాండంగా నటించాడు. చాలా కొత్తగా కూడా చేసాడు. ఇక ఈ నెల ఇరవై ఆరున ఓటిటిలో అమెజాన్ ప్రైమ్ ద్వారా  స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోని రెండు సీన్స్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతుంది. రవిబాబుకి విజయ్ వార్నింగ్ ఇచ్చే సీన్ అండ్  దోశలు సీన్. ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా అలాంటి దోశలు వేసుకోరని ఈ ఐడియా ఎలా వచ్చిందో అంటూ ట్రోల్  చేస్తున్నారు.  

ట్రైలర్ రిలీజ్ టైం లో కూడా వాటిపైనే ట్రోల్ల్స్ జరిగాయి.  విజయ్ ఫ్యాన్స్ మాత్రం డైరెక్టర్ చెప్పింది  విజయ్ చేసాడంటు సపోర్ట్ గా నిలుస్తున్నారు ఫ్యామిలీ స్టార్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై  హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ జత  కట్టింది. జగపతి బాబు, వాసుకి ,రవిప్రకాష్, రోహిణి హట్టంగడి, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. పరశురామ్ దర్శకత్వం వహించగా  గోపి సుందర్ మ్యూజిక్ ని అందించాడు. 50 కోట్ల బడ్జట్ తో  తెరకెక్కింది