English | Telugu

నేను - నా రాక్షసి హిట్టవుతుంది- ఇలియానా

"నేను-నా రాక్షసి" హిట్టవుతుంది అని ఇలియానా అంటూందట. వివరాల్లోకి వెళితే యువ హీరో దగ్గుబాటి రానా హీరోగా, నలక నడుము గోవా సుందరి ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి), నిర్మిస్తున్న చిత్రం" నేను-నా రాక్షసి". ఈ "నేను-నా రాక్షసి" మూవీ గురించి హీరోయిన్ ఇలియానా చాలా ఆశతో ఉంది. ఈ "నేను-నా రాక్షసి" చిత్రం కచ్చితంగా హిట్టవుతుందని అంటూంది ఇలియానా.


గతంలో మంచు విష్ణువర్థన్ హీరోగా, వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన "సలీం" చిత్రంలో, నితిన్ హీరోగా నటించిన "రెచ్చిపో" చిత్రంతో పాటు ఇటీవల యన్ టి ఆర్ హీరోగా నటించిన "శక్తి" చిత్రంలో కూడా ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ మూడు చిత్రాలూ ఫ్లాపులుగా మారటంతో, ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న "నేను - నారాక్షసి" చిత్రం మీదే ఇలియానా ఆశలన్నీ పెట్టుకుంటుంది.


వరసగా ముడు ఫ్లాపులిచ్చినా కూడా ఇలియానాకున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గకపోవటం విశేషం. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలోని "3ఇడియట్స్" చిత్రం రిమేక్ లో ఇలియానా నటిస్తూంది. ఈ చిత్రంలో నటించటానికి ఇలియానా రెండు కోట్లు పారితోషికం తీసుకుందట.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.