English | Telugu
బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రముఖ హీరో తరుణ్ రాజ్ అరెస్ట్
Updated : Mar 18, 2025
దుబాయ్(Dubai)నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తు బెంగుళూరు(Bengaluru)ఎయిర్ పోర్ట్ లో పట్టుబడిన ప్రముఖ కన్నడ నటి రన్యారావు(Ranya Rao)పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే.ఆమె సవతి తండ్రి సీనియర్ ఐపీఎస్(Ips)అధికారి రామచంద్రరావుకి కూడా అక్రమ బంగారం రవాణాలో సంబంధం ఉండవచ్చనే అనుమానంతో ఉన్నతాధికారులు ఆయన్ని కూడా విచారిస్తున్నారు.
ఇప్పడు ఈ కేసులో ప్రముఖ తెలుగునటుడు విరాట్ కొండూరు(Virat Konduru)ని పోలీసులు అరెస్ట్ చేసారు.2018 లో లక్ష్మికాంత్ చెన్నా(Lakhmikanth Chenna)దర్శకత్వంలో తెరకెక్కిన 'పరిచయం'(Parichayam)అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విరాట్ ఆ సినిమా పరాజయం చెందటంతో మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు.ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగారం అక్రమ రవాణా కేసులో రన్యారావుతో పాటు విరాట్ అరెస్ట్ కావడం సంచలనం సృష్టిస్తుంది.
2019 నుంచి రన్యారావుతో విరాట్ కి సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దుబాయ్‌లో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవడానికి విరాట్ తన యుఎస్ పాస్‌పోర్ట్(Pass Port) ఉపయోగించాడు.ఆ పాస్‌పోర్ట్‌తో చెకింగ్ లేకుండానే దుబాయ్ నుంచి బెంగుళూరుకి గోల్డ్ స్మగ్లింగ్ చేసాడని తెలుస్తుంది.విరాట్ తో కలిసి రన్యారావు పలుమార్లు దుబాయ్ కి కూడా వెళ్లినట్టుగా కూడా దర్యాప్తు లో బయటకి వచ్చింది.ప్రస్తుతం విరాట్ ని DRI టీమ్ విచారిస్తుండగా,ముందు ముందు ఈ కేసులో ఎవరి పేర్లు బయటకి వస్తాయనే చర్చ మొదలయ్యింది.విరాట్ అసలు పేరు తరుణ్ రాజ్(Tarun raj)