English | Telugu

శ్రీమంతుడు కలెక్షన్స్: ఫస్ట్ డే ఎంత?

బాహుబలి రికార్డుల వర్షం తరువాత టాలీవుడ్ నుంచి వచ్చిన మరో భారీ హైప్ మూవీ శ్రీమంతుడు. మహేష్ ప్రధాన పాత్రలో ''ఎద‌గ‌డం అంటే మ‌నం మాత్ర‌మే కాదు, మ‌న ఊరువాళ్లూ బాగుప‌డిన‌ప్పుడే ఎదిగిన‌ట్టు''.. అనే పాయింట్ చుట్టూ అల్లుకొన్న సినిమా ఇది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇప్పటికే ప్రిమియర్ టాక్ బయటకు వచ్చింది. మార్నింగ్ షో ఆల్రెడీ మొదలైపోయాయి. ఈ సినిమాకు వచ్చిన హైప్, క్రేజ్ ను బట్టి చూస్తే టాలీవుడ్ ఫస్ట్ డే కలెక్షన్ల లో కొత్త రికార్డులు నెలకొల్పుతుందని అంటున్నారు. ఈ మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ 20 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ వుందని ట్రేడ్ వర్గాల సమాచారం. మరి బాక్స్ ఆఫీస్ బరిలో సూపర్ స్టార్ దిగాడంటే టాప్ 5 ఆర్డర్ మారిపోవాల్సిందే..!!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.