English | Telugu

ఫ్యాన్స్ టాక్: బహుబలిని దాటేస్తాడా?

శ్రీమంతుడు ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులలో బాహుబలిని దాటేస్తాడని మహేష్ అభిమానులు అంటున్నారు. మరి నిజంగానే శ్రీమంతుడుకి అంత స్టామినా వుందా? బాహుబలి మొదటి రోజు సృష్టించిన వసూళ్ళ సునామీని అంత తేలికగా బద్దలు కొట్టేస్తాడా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి రికార్డుల్ని ఇప్పట్లో వేరే ఏ సినిమా టచ్ చేయలేదనేది అందరికీ తెలిసిన వాస్తవమే.ఏదో ఫ్యాన్స్ అభిమానంతో అలా అంటున్నారే తప్ప ఆ సంగతి వారికీ కూడా తెలుసు.

ఇక్కడ వారు సంతోషించాల్సిన విషయం ఏమిటంటే..బాహుబలి తరువాతి స్థానాన్ని శ్రీమంతుడు ఆక్రమించబోతున్నాడు. ఇప్పటికే తొలిరోజు బుకింగ్లన్నీ క్లోజ్ అయిపోయాయి. టిక్కెట్ కౌంటర్లు జామ్ అయిపోయాయి. కాబట్టి శ్రీమంతుడు రికార్డులకు తెరతీసినట్టేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా ఒక్క తొలిరోజే రూ.20కోట్లు వరల్డ్ వైడ్ షేర్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఆగడు తొలి రోజు నెం.1 షేర్ సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. ఆ తర్వాత పవన్ నటించిన అత్తారింటికి దారేది నిలిచింది. ఈ రికార్డులన్నిటినీ శ్రీమంతుడు తిరగరాస్తాడనే ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి బాహుబలి మినహాయించి ఇతర సినిమాల రికార్డులన్నిటిని శ్రీమంతుడు చేరిపేయబోతున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.