English | Telugu

శ్రీమంతుడు 'సెన్సార్' రిపోర్ట్

సూపర్ స్టార్ శ్రీమంతుడు 'సెన్సార్' కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ అధికారులు ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారట. అలాగే ఈ చిత్ర నిర్మాతలను కూడా పొగడ్తలతో ముంచెత్తారట. ''చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి విలువలు వున్న సినిమా చూశా౦. మానవతా విలువలతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ వున్న సినిమా చూసి చాలా కాలమైందని'' నిర్మాతలను మెచ్చుకున్నారట.

ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో వస్తున్న ఈ సినిమలో కుటుంబ బంధాల గురించి.. మానవతా విలువల గురించి వర్ణిస్తూ.. గ్రామాల ప్రాధాన్యతను కూడా తెలియచేసేలా అద్భుతంగా వచ్చిందట. బేసికల్ గా మన సూపర్ స్టార్ కి ఓవర్సీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే ఈ సినిమాలో విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డ ఎన్నారైలకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని చెబుతున్నారు.

తెలుగులో ప్రమోషన్లతో దూసుకుపోతున్న ‘శ్రీమంతుడు’, నేటి నుంచి తమిళంలో ప్రచార కార్యక్రమాలకు తెరలేపనున్నాడు. మహేష్ స్వయంగా ఈ సాయంత్రం చెన్నైలో జరిగే ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. ఈ సందర్భంగా ’సెల్వందన్’ ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ శృతి హాసన్, దర్శకుడు కొరటాల శివ తదితరులు హాజరుకానున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.