English | Telugu

పోలీస్ స్టేషన్ కి ఎస్పీ చరణ్.. 25 నెలలుగా అద్దె చెల్లించడం లేదు

తెలుగు ప్రజలందరి ఉమ్మడి ఆస్థి ఏదైనా ఉందంటే అది 'గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం'(SP Balasubrahmanyam). ఆయన పాటల ప్రవాహంలో నిత్యం తెలుగువారంతా ప్రవహిస్తూనే ఉన్నారు. ఆయన వారసుడు 'ఎస్పీ చరణ్'(SP Charan)తెలుగు ప్రజలందరికి సుపరిచయస్తులే. సింగర్ గా నేటికీ ఎన్నో మంచి పాటలకి తన స్వరాన్ని అందిస్తు వస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా కూడా పలు చిత్రాల ద్వారా తన సత్తా చాటాడు.

ఎస్పీ చరణ్ కి 'చెన్నై'సాలిగ్రామంలోని సత్య గార్డెన్‌లో ఒక ప్లాట్ ఉంది. సదరు ప్లాట్ లో 'తిరుజ్ఞానం' అనే సహాయ దర్శకుడు నెలకి 40,500 రూపాయిల అద్దె ఒప్పందంతో నివాసం ఉంటున్నాడు. ఈ మేరకు 1.50 లక్షలు అడ్వాన్స్ కింద ఇవ్వడం జరిగింది. కానీ గత ఇరవై ఐదు నెలలుగా 'తిరుజ్ఞానం' అద్దె చెల్లించడం లేదు. దీంతో చరణ్ తన ఏరియా పరిదిలోని 'కేకేనగర్' పోలీసులకి 'తిరుజ్ఞానం' పై ఫిర్యాదు చేసాడు. సదరు ఫిర్యాదులో నెలకి ఖచ్చితంగా అద్దె ఇస్తానని ఒప్పుకొని, అడ్వాన్స్‌గా ఇచ్చింది తప్ప, ఇరవై ఐదు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. డబ్బులు అడిగితే అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు,బెదిరింపులకి పాల్పడుతున్నాడని చరణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు తిరుజ్ఞానంపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చరణ్ ప్రస్తుతం తన తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తు 'ఈటీవీ'(Etv)వేదికగా ప్రసారమవుతున్న 'పాడుతా తీయగా'(Padutha Theeyaga)కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.తన తండ్రి లాగానే కార్యక్రమాన్ని ఎంతో హుందాగా జరిపిస్తున్నారనే కామెంట్స్ ని ప్రేక్షకుల నుంచి అందుకుంటున్నాడు. గత ఏప్రిల్ లో 'లవ్ యువర్ ఫాదర్' అనే చిత్రంలో హీరో తండ్రిగా కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.