English | Telugu
రజనీకాంత్ లోకేష్ ల సినిమాలో బడా హీరో
Updated : Nov 28, 2023
రజనీకాంత్ జైలర్ సినిమా విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు. ఆ సినిమా సాధించిన విజయం తాలూకు జ్ఞాపకాలన్నీ ఇంకా ఎవరి మైండ్ లో నుంచి వెళ్లిపోలేదు. జైలర్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో జ్ఞానవేల్ రాజాతో ఒక చిత్రం చేస్తున్న రజనీ ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు. ఆ మూవీ అనౌన్స్ మెంట్ చేసినప్పుడే రజనీ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోను లోకేష్ రజనీ కాంబో సరికొత్త రికార్డులు సృష్టిచబోతుందనే విషయం అందరికి అర్ధం అయ్యింది. అలాగే తాజాగా ఈ మూవీకి సంబంధించి వస్తున్న ఒక న్యూస్ రజనీ లోకేష్ ల సినిమా తాలూకు స్థాయిని చెప్తుంది.
రజనీ, లోకేష్ ల కాంబినేషన్ లో వస్తున్న తలైవర్ 171 లో లేటెస్ట్ యువ కధానాయకుడు శివ కార్తికేయన్ నటించబోతున్నాడనే వార్తలు తమిళనాట మొత్తం చక్కర్లు కొడుతున్నాయి. ఇదే కనుక నిజమైతే రజని అభిమానులకి అలాగే శివ కార్తికేయన్ అభిమానులకి అలాగే అన్నిటికంటే ముఖ్యంగా సినిమా ప్రేక్షకులకి ఒక పండగే అని చెప్పవచ్చు. చిత్ర బృందం కార్తికేయన్ విషయం అధికారకంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ వార్తలు విన్న ఇరువురి అభిమానులు మాత్రం సినిమాలో శివ కార్తికేయన్ క్యారక్టర్ ఏ విధంగా వుండబోతుందనే ఆలోచనలో ఇరువురి అభిమానులు ఉన్నారు.
తమిళ చిత్ర సీమలో శివ కార్తికేయన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.ఎన్నో అధ్బుతమైన చిత్రాల్లో నటించి తన కంటూ ప్రత్యేక అభిమానగణాన్ని సంపాదించాడు. అలాగే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కి మంచి పేరు ఉంది. తలైవర్ 171 ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
