English | Telugu

పార్టీ పెట్టి వేల కోట్లు సంపాదించాడు చిరంజీవి.. మన్సూర్‌ ఆరోపణలు!

పార్టీ పెట్టి వేల కోట్లు సంపాదించాడు చిరంజీవి.. మన్సూర్‌ ఆరోపణలు!

త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యల వల్ల జరిగిన ఘటనలు అందరికీ తెలిసినవే. చివరికి త్రిషకు క్షమాపణ చెప్పాడు మన్సూర్‌. అంతటితో ఆగకుండా తనను దుర్భాషలాడిన త్రిష, ఖుష్‌బూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా వేస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.  దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశాడు మన్సూర్‌. ఈ వీడియోలో చిరంజీవిని విమర్శిస్తూ మాట్లాడాడు మన్సూర్‌.

అసలు ఆ వీడియోలో మన్సూర్‌ ఏం మాట్లాడాడో చూద్దాం.... ‘‘చిరంజీవి ప్రతి సంవత్సరం ఓల్డ్‌ హీరోయిన్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటారు. నేను చిరంజీవి సినిమాల్లో నటించాను. కానీ, నన్ను మాత్రం ఆహ్వానించలేదు. మీరు ఎవరితో పార్టీ చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ, ఒక ఇష్యూ జరిగినపుడు కనీసం చిరంజీవిగారు నాకు ఫోన్‌ చేసి జరిగింది ఏమిటి అనేది తెలుసుకోకుండా నాది వక్రబుద్ధి అంటూ మాట్లాడారు. ఎవరిది వక్రబుద్ధి? ఆయన పార్టీ పెట్టి వేల కోట్లు సంపాదించారు. పెద్ద పెద్ద పార్టీల నుంచి డబ్బు వస్తుంది. ఆయన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీ పెట్టారు. నేనెప్పుడూ ఆయన్ని చూడలేదు. వాళ్ళందర్నీ సంపాదించుకోమనండి. కానీ, వాళ్ళు సంపాదించింది పేదవారికి పంచరు. వారి అవసరానికే వాడుకుంటారు. నన్ను దూషిస్తూ మాట్లాడిన చిరంజీవి, త్రిష, కుష్‌బులపై పరువు నష్టం దావా వేస్తాను. త్రిషపై రూ.10 కోట్లు, కుష్‌బూపై రూ.10 కోట్లు, అలాగే చిరంజీవిపై రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేయబోతున్నాను. వచ్చిన డబ్బును తమిళనాడులో కల్తీ మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు అందజేస్తాను. నాకు ఒక్క పైసా కూడా అక్కర్లేదు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదు. నేను వెల్‌ సెటిల్డ్‌.  ఐ యామ్‌ హ్యాపీ విత్‌ మై వరల్డ్‌. నాకు ఉన్న పేరును ఎవ్వరూ చెడగొట్టలేరు. ఆ ముగ్గురి మీద పరువు నష్టం దావా వేసి వచ్చిన డబ్బును పేదవారికి పంచుతాను. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా’’ అన్నారు.