Read more!

English | Telugu

జపాన్ లో సింగమలై రికార్డుల ఊచకోత!

జపాన్ లో క్రేజ్ సంపాదించుకున్న అతి కొద్దిమంది ఇండియన్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన డ్యాన్స్ లకు అక్కడ ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల్లోని పలు పాటలకు అక్కడివారు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఎన్టీఆర్ సినిమాలను కూడా అక్కడ మంచి ఆదరణే లభిస్తుంటుంది. రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం సంచలన వసూళ్లతో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటించిన ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం నాటి సినిమా 'సింహాద్రి' రీరిలీజ్ అవుతుండగా.. దానికి జపాన్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటం సంచలనంగా మారింది.

ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'సింహాద్రి' 2003 లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాని ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న భారీస్థాయిలో రీరిలీజ్ చేస్తున్నారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఇక జపాన్ లో అయితే ఊహించని సంచలనాన్ని నమోదు చేసింది. విడుదలకు ఇంకా మూడు రోజులు ఉండగానే ప్రీ సేల్స్ తో ఇప్పటికే 1 మిలియన్ యెన్స్ మార్క్ ని అందుకొని సత్తా చాటింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ 6 లక్షలకు పైగా ఉంటుంది. కొత్త సినిమాలకే ఆ స్థాయి రెస్పాన్స్ వస్తే గొప్పగా చెబుతుంటారు.. అలాంటిది 20 ఏళ్ళ నాటి సినిమా రీరిలీజ్ అవుతుంటే ఈ స్థాయి రెస్పాన్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.