English | Telugu
శరత్ బాబు కన్నుమూత
Updated : May 22, 2023
సీనియర్ సినీ యాక్టర్ శరత్ బాబు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుమారు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫస్ట్ బెంగుళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తర్వాత హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. స్కిన్ ఇన్ఫెక్షన్ వ్యాధి కారణంగా ఊపిరితిత్తులు, కిడ్నీలతో పాటు బాడీలోని మిగతా ఆర్గాన్స్ అన్నీ బాగా డామేజ్ కావడంతో చికిత్సకు ఆయన శరీరం స్పందించడం మానేసింది.
రామరాజ్యం మూవీతో 1974లో శరత్ బాబు హీరోగా పరిచయమయ్యారు శరత్ బాబు . ఆ తర్వాత తెలుగు, తమిళంలో ఎన్నో మూవీస్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమకింకరుడు, అమరజీవి వంటి ఎన్నో సినిమాలు ఆయనకు మంచి గుర్తింపునిచ్చాయి. ఆయన చివరిసారిగా పవన్ కళ్యాణ్ మూవీ ‘వకీల్ సాబ్’ మూవీలో కనిపించి అలరించారు . త్వరలో రిలీజ్ కానున్న ‘మళ్లీ పెళ్లి’ మోవీలోనో ఆయన ఒక పాత్ర పోషించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన నటన అద్భుతం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ బాబు మూడు నంది అవార్డులను కూడా అందుకున్నారు. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు.
