English | Telugu
కాజల్ 5 లక్షలు, సమంత 10 లక్షల విరాళం
Updated : Oct 15, 2014
హుద్‌హుద్ తుపాను బాధితులకు అండగా నిలిచేందుకు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఒకరి తరువాత ఒకరు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా హీరోలు తుపాను బాధితుల సహాయార్థం ప్రకటించగా, లేటెస్ట్ గా సినీ నటిలు సైతం తాము వంతు సహాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ రోజు ఉదయం ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించగా, హీరోయిన్ సమంత 10లక్షలు విరాళాన్ని ప్రకటించింది. సమంత పర్సనల్‌గా 5 లక్షలు, ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ తరఫున 5 లక్షలు మొత్తం 10 లక్షలు విరాళంగా ప్రకటించింది. మరోవైపు ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశి ఖన్నా కూడా తుపాను బాధితులకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది.