English | Telugu

తెలుగు రీమేక్స్‌తో సల్మాన్ హ్యాట్రిక్ హిట్



బాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా మారిన సల్మాన్ ప్రస్తుతం కిక్ సినిమా కలెక్షన్ల్ సందడిలో వున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం 85 కోట్లు సంపాదించిందని టాకు. రంజాన్ పండుగ సెలవు రోజున ఈ సినిమా వంద కోట్ల బిజినెస్ పూర్తి చేసుకుంటుందని గట్టి నమ్మకంతో వున్నారు 'కిక్' ఫిలిం మేకర్స్.
ఇక ఈ సినిమా చూసిన ఒరిజినల్, తెలుగు 'కిక్' సినిమా రూపకర్త సురెంద్ర రెడ్డి మాత్రం ఈ సినిమా చూసి చాలా డిసపాయింట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు సినిమాను అర్థం చేసుకున్నట్లు కానీ, సల్మాన్ ఖాన్ కి తగ్గట్టు కానీ లేదని ఆయన ఫీల్ అయినట్లు తెలుస్తోంది. మరో వైపు బాలీవుడ్ ప్రముఖ దర్శకులు కరణ్ జోహర్, సుభాష్ ఘయ్ వంటి వారు ఈ సినిమా అదిరిపోయిందటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఇవన్నీ అటుంచితే సల్మాన్ ఖాన్ కి మాత్రం తెలుగు రీమేక్ లు బాగా అచ్చోస్తాయని మరోసారి ప్రూవ్ అయింది. పోకిరి, రెడీ, ఇప్పుడు కిక్ సినిమాలు తెలుగు నుంచి హిందీలో సల్మాన్ హీరోగా రూపొందిన చిత్రాలే.


సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.