English | Telugu

ఏడుకొండల వాడి సాక్షిగా తిరుపతిలో అల్లు అర్జున్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మెగా మేనల్లుడు తేజ్ 

ఏడుకొండల వాడి సాక్షిగా తిరుపతిలో అల్లు అర్జున్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మెగా మేనల్లుడు తేజ్ 

2015 లో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ సినిమా ద్వారా తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసిన మెగా మేనల్లుడు  సాయి ధరమ్ తేజ్.  సినిమా సినిమాకి తన ఇమేజ్ ని పెంచుకుంటు పోతున్న తేజ్  తాజాగా  ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్ళాడు. అక్కడ అల్లు అర్జున్ మీద  తేజ్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

తేజ్ తాజాగా  తిరుమల తిరుపతి  వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత  మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంలో అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు రావడం పై మీ అభిప్రాయమేంటి అని  విలేకర్లు అడిగారు. అప్పుడు తేజ్   బన్నీ కి  నేషనల్ అవార్డు రావడం చాలా గర్వంగా ఉందని ఆ అవార్డు తో బన్నీ తెలుగువారి ఖ్యాతిని  కూడా పెంచాడు.   అవార్డు వచ్చిన సమయంలో నాకు కలిగిన  ఆనందాన్ని మాటల్లో కూడా  చెప్పలేనని తేజ్ అన్నాడు. అలాగే  తెలుగువాళ్లు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటడం గొప్ప విషయమని కూడా  తేజ్ అన్నాడు.ఇప్పుడు  తేజ్ చెప్పిన ఈ మాటలు  బన్నీ ఫ్యాన్స్ లో మంచి జోష్ ని తెచ్చాయి. అలాగే తేజ్ కాణిపాక వరసిద్ధి వినాయకుడిని కూడా దర్శించుకున్నాడు.

  

కాగా తేజ్ ఆక్సిడెంట్ తర్వాత వచ్చిన విరూపాక్ష  సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తన మావయ్య పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో మాత్రం ఆశించినంత విజయాన్ని  అందుకోలేక పోయింది. ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వం లో గాంజా శంకర్ అనే ఫుల్ మాస్ మూవీ ని తేజ్  చేస్తున్నాడు. ఈ చిత్రం  షూటింగ్ సంక్రాంతిలో ప్రారంభం కాబోతుంది.  

 

ఏడుకొండల వాడి సాక్షిగా తిరుపతిలో అల్లు అర్జున్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మెగా మేనల్లుడు తేజ్