English | Telugu
అనుష్క కెరీర్‌తో ఆడుకొంటున్నాడా??
Updated : Sep 7, 2015
రుద్రమదేవి సినిమాపై గుణశేఖర్ మాత్రమే కాదు, అనుష్క కూడా గంపెడాశలు పెట్టుకొంది. ఈ సినిమా కోసం లెక్కలేనన్ని కాల్షీట్లు ఇచ్చింది. `మీరు ఎప్పుడు పిలిచినా షూటింగ్ కి వస్తా` అంటూ గుణకి భారీ ఆఫర్ ఇచ్చింది. చెప్పినట్టే రెండేళ్ల పాటు విరామం లేకుండా ఈసినిమాకే అంకితమైపోయింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పబ్లిసిటీ విషయంలో గుణకు అనుష్క మొండి చేయి ఇచ్చేసింది. `ఒక్కరోజు ఆఫీసుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వు..` అని గుణ అడిగినా `డోన్ట్ కేర్..` అంటోందట. అంతలోనే ఎంత మార్పు?? అనుష్క ఎందుకిలా ప్రవర్తిస్తోంది??
రుద్రమదేవి డిలే విషయంలో అనుష్క ఏమాత్రం హ్యాపీగా లేదని ఇండ్రస్ట్రీ టాక్. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈసినిమా వాయిదాలపై వాయిదాలు వేసుకొంటూ వెళ్తోంది. అక్టోబరు 9న విడుదల చేస్తానని గుణశేఖర్ ప్రకటించినా.. ఆ రోజుకూడా ఈ సినిమా వస్తుందో రాదో అని డౌట్. ఇప్పటికే అనుష్క ఓ విడతలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేసింది. విడుదలకు ముందు మరోసారి ఇంటర్వ్యూలు ఇవ్వాల్సివస్తుందని గుణశేఖర్ చెప్పాడట. దాంతో అనుష్క గుణపై సీరియస్ అయ్యిందని టాక్. ''నా కెరీర్‌తో ఆటలాడొద్దు. ఇప్పటికే సినిమా డిలే అయ్యింది. మీ వల్ల చాలా సినిమాలు వదులుకొన్నా. ఇక ఒక్కరోజు కూడా ఈసినిమా కోసం కేటాయించలేను'' అని మొహంమీదే చెప్పేసిందట.
రుద్రమదేవి ఆలస్యం అవ్వడం వల్ల వ్యక్తిగతంగా గుణశేఖర్‌కే కాదు, అనుష్కకీ నష్టమే. ఈసినిమా ఫ్లాప్ అయితే గుణ ఆర్థికంగా నష్టపోతాడు. ఈ ఫ్లాప్ ప్రభావం అనుష్కపైన కూడా భారీగా పడబోతోంది. అందుకే.. ఈ సినిమా డిలే అవ్వడం అనుష్కకి ఏమాత్రం ఇష్టం లేదట. ఇప్పటి వరకూ ఈ సినిమాని ఎన్నిసార్లు వాయిదా వేస్తున్నా ఓపిగ్గా భరించిన అనుష్క... అక్టోబరు 9కి ఈ సినిమా మార్చడంతో.. తట్టుకోలేకపోతోందట. ఎందుకంటే అక్టోబరు 2న సైజ్ జీరో సినిమా విడుదల చేయాలన్నది పీవీపీ ప్లాన్. అక్టోబరు 9న రుద్రమ వస్తే.. వాళ్లూ డేట్ మార్చుకోక తప్పదు. అంటే రుద్రమదేవి వాయిదా.. సైజ్ జీరోపై ప్రభావం చూపిస్తుందన్నమాట. ఓసారి వాయిదా పడిన సినిమాకి అటోమెటిగ్గా హైప్ తగ్గుతూ వస్తుంది. సో.. గుణ నిర్ణయాల వల్ల అనుష్క రెండు విధాలా నష్టపోతోందన్నమాట. అందుకే పాపం... గుణపై అనుష్కకి అంత కోపం.