English | Telugu
స్టార్ స్టేటస్ పై కన్నేసిన హీరోయిన్
Updated : Feb 5, 2015
కుర్రహీరోలలతో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న రెజీనా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టేటస్పైన కన్నేసిందట. ఇప్పటికే మంచి నటిగా పేరు తెచ్చుకున్న రెజీనా స్టార్ హీరోల సరసన అవకాశం కోసం ఎదురుచూస్తోందట. దీని కోసం పెద్ద దర్శకులకు రాయబారాలు పంపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం సాయి ధరమ్‌తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ బన్నీ పక్కన చాన్స్ కొట్టేయడానికి ప్రయత్నాలు మమ్మురం చేసిందట. అల్లు అర్జున్ పక్కన నటిస్తే టాప్ లీగ్ లోకి ఈజీగా ఎంటర్ అవ్వచ్చని భావిస్తుందట. మరి ఈ అమ్మడు ఆశలు నెరవేరుతాయో? లేదో? వేచి చూడాలి.