English | Telugu
'కిక్ 2' ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్
Updated : Aug 22, 2015
మాస్ మహరాజ్ రవితేజ కిక్ 2 సినిమా ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు రాబట్టినట్లు ఇండస్ట్రీ టాక్. రెండు తెలుగు రాష్ర్టాల్లోను కలిపి కిక్ 2 తొలి రోజు 7.2 కోట్ల షేర్ వచ్చిందట. రవితేజ సినిమాకు ఈ మేరకు రావడం కాస్త చెప్పుకోదగ్గర విషయమే. సురేంద్ర రెడ్డి రేసుగుర్రం ఎఫెక్ట్, రవితేజ పవర్ ఎఫెక్ట్, మాగ్జిమమ్ థియేటర్లలో విడుదల చేయడం ఈ సినిమాకు కలిసి వచ్చాయని చెప్పాలి. మొదటి మూడు రోజులు ఈ సినిమాకు షేర్ కూడా కాస్త ఎక్కువగా వుంటే బయ్యర్లు, నిర్మాత హ్యాపీ అవుతారు. కిక్ 2లో కంఫర్ట్ కాన్సెఫ్ట్ ప్రేక్షకులకు అంత కంఫర్ట్‌గా లేదన్న టాక్ వస్తోంది. అలాగే బి సి ల్లో మంచి టాక్ వస్తుందని అంటున్నారు.