English | Telugu

'బెంగాల్ టైగర్' జోరు పెరిగింది

కిక్‌ 2 లాంటి డిజాస్టర్‌ తర్వాత మాస్‌ రాజా రవితేజ మార్కెట్ పడిపోయిందని అందరూ కామెంట్లు చేశారు. సినిమాకు పెట్టిన బడ్జెట్‌తో పోల్చుకుంటే అందులో సగం వసూళ్లను కూడా కిక్‌ 2 రాబట్టలేకపోవడంతో రవితేజ సినిమాపై భారీగా ఇన్వెస్ట్‌ చేసేందుకు నిర్మాతలు, బయ్యర్లు ముందుకు రావడం లేదని ఇండస్ట్రీ లో టాక్ నడించింది. కానీ బెంగాల్ టైగర్ రిలీజ్ కి ముందే కొత్త రికార్డులు నెలకొల్పుతుంది. ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ను ఓ ప్రముఖ ఛానెల్‌ రూ.7 కోట్లకు దక్కించుకుందట. రవితేజ కేరీర్‌లోనే ఇది హయ్యస్ట్‌ శాటిలైట్‌ రేట్‌ కావడం విశేషం. ఈ సినిమా బడ్జెట్‌ 25 కోట్ల వరకు అయింతే థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.34 కోట్ల వరకు జరిగిందని సమాచారం. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓ రేంజిలో జరుగుతున్నాయి. సో పోటీ లేకుండా సోలోగా విడుదలవుతున్న 'బెంగాల్‌ టైగర్‌'పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.