English | Telugu
గొప్ప రాజు వెనక రాణి ఉంటుంది..రష్మిక ట్వీట్ వైరల్
Updated : Jan 21, 2025
స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika mandanna)యానిమల్,పుష్ప 2(Pushpa 2)తో పాన్ ఇండియా లెవల్లో హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.దీంతో ఆమె అప్ కమింగ్ సినిమాలపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.ఈ క్రమంలో రష్మిక ఫిబ్రవరి 14 న 'చావా'(Chhaava)అనే మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరాఠా యోధుడు,ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji)కుమారుడు శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'చావా' లో టైటిల్ రోల్ లో విక్కీ కౌశల్ నటించగా,మహారాణి యేసు బాయ్ క్యారక్టర్ లో రష్మిక చేస్తుంది.ఈ మూవీ గురించి రష్మిక 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేస్తు 'ప్రతి గొప్పరాజు వెనుక,సాటిలేని శక్తిగల రాణి ఉంటుంది.మహారాణి యేసుబాయి స్వరాజ్య గర్వం అనే ట్వీట్ ని షేర్ చేసింది.మూవీలోని తన క్యారక్టర్ కి సంబంధించిన కొన్ని పిక్స్ ని కూడా షేర్ చెయ్యగా,ఒంటి నిండా చీరని కప్పుకొని,నిండుగా ఆభరణాలని ధరించిన ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.దీంతో 'చావా'లో రష్మిక నట విశ్వరూపాన్ని చూడబోతున్నామనే కామెంట్స్ అభిమానుల వద్ద నుంచి వినిపిస్తున్నాయి.
మడాక్ ఫిలిమ్స్ పతాకంపై దినేష్ విజన్(Dinesh VIjan)130 కోట్ల భారీ వ్యయంతో 'చావా'ని నిర్మిస్తుండగా లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar)దర్శకత్వం వహించాడు.అక్షయ్ ఖన్నా,అశుతోష్ రానా,దివ్య దుత్త,సంతోష్ జువేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించాడు.
