English | Telugu
రాణా ఓ సెల్ఫీ స్టిక్!
Updated : Jul 1, 2016
ప్రస్తుతం సింగపూర్ లో జరుగుతున్న "సైమా అవార్డ్స్" వేడుకలో నిన్న రాత్రి మన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రఖ్యాత గాయనీమణి ఎస్.జానకికి "లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్" అవార్డుతో సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సందర్భంగా "సైమా" వేడుకల్లో పాల్గొన్నవారందరితోనూ ఒక సెల్ఫీ తీసుకొన్నారు. ఒకరిద్దరితో అయితే మెగాస్టారే స్వయంగా తీసుకొనేవారేమో కానీ.. ఏకంగా 25 మందికిపైగా ఉండడంతో.. అక్కడ "సెల్ఫీ స్టిక్" అవసరం పడింది. సమయానికి "సెల్ఫీ స్టిక్" అందుబాటులో లేకపోవడంతో.. ఆ స్టిక్ స్థానంలో రాణా చెయ్యి వచ్చింది. రాణా తీసిన ఈ మెగా సెల్ఫీలో మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని.. అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, అక్కినేని అఖిల్, సమంత, నిత్యామీనన్, ఖుష్బూ, మంచు లక్ష్మి, ప్రణీత, అలీ, మెహరీన్, శ్రియ, మన్నారా చోప్రా, అల్లు అరవింద్, రాధిక, ఊర్వశి రొటేలా, సాయికుమార్, రాజేంద్రప్రసాద్, సుహాసిని, రాధిక తదితరులను చూడవచ్చు.
సింగపూర్ లో అట్టహాసంగా జరుగుతున్న ఈ వేడుకలకు తెలుగు చిత్రసీమ నుంచి మాత్రమే కాక తమిళ, మలయాళ, కన్నడ చిత్రసీమల నుంచి కూడా తారలు తరళిరానున్నారు!