English | Telugu

ర‌కుల్‌కి ఎంత పొగ‌రో..?!

ఒక‌ట్రెండు విజ‌యాలు చేతిలో ప‌డ‌గానే, నాలుగైదు ఆఫ‌ర్లు అందుకోగానే హీరోయిన్ల‌కు కాలు నేల‌మీద నిల‌వ‌దు. అనుకోకుండా వ‌చ్చిన క్రేజ్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోయి.. ఆకాశంలో విహ‌రిస్తుంటారు. అలాంట‌ప్పుడు కిందున్న‌వాళ్లు ఏం క‌నిపిస్తారు.??? దాంతో అవాకులూ చెవాకులూ పేలిపోతుంటారు. ప్ర‌స్తుతం ర‌కుల్ ప్రీత్‌సింగ్ ప‌రిస్థితీ అంతే. టాలీవుడ్‌లో బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది ర‌కుల్ బండి. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ సినిమాల‌లో ఆఫ‌ర్లు అందుకొని.. టాప్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడామె క‌ళ్ల‌కు బ‌డా హీరోయిన్లు కూడా ఆనండం లేదు. నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేస్తోంది.

ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కంటే సీనియ‌ర్ హీరోయిన్ల‌యిన త్రిష‌, కాజ‌ల్‌, అసిన్‌ల‌ను కాస్త చుల‌క‌న‌గా మాట్లాడి... టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. త్రిష‌, కాజ‌ల్‌ల‌తో త‌న‌ని పోలుస్తున్నార‌ని, అయితే వాళ్లెవ‌రూ బాలీవుడ్‌లో నెగ్గుకు రాలేద‌ని, అలాంటివాళ్ల‌తో పోలిస్తే త‌న‌కు ఇబ్బందిగా ఉంటుంద‌ని క‌ల‌రింగు ఇస్తోంది ర‌కుల్‌. అంతేకాదు.. నిల‌క‌డ‌గా విజ‌యాలు సాధించ‌డం త‌న‌కు హాబీ అయిపోయింద‌ని, ఇన్నింగ్స్ ముగిసిన వాళ్ల‌తో పోలిస్తే తాను త‌ట్టుకోలేన‌ని ప‌రోక్షంగా త‌న సీనియ‌ర్ల‌పై సెటైర్లు వేసింది. ర‌కుల్ దూకుడు చూసి.. మీడియా సైతం ముక్కున వేలేసుకొంటోంది. రెండు మూడు విజ‌యాల‌కే ఇలా పొంగిపోతూ.. త‌న సీనియ‌ర్ల‌ను త‌క్కువ చేసి మాట్లాడ‌డం ర‌కుల్ స‌న్నిహితుల్నీ షాక్‌లో ప‌డేసింది.

మీడియా ముందు ఇలా మాట్లాడ‌డం భావ్యం కాద‌ని ర‌కుల్ స‌న్నిహితులు సైతం స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌. ఆ మాట‌లూ త‌ల‌కెక్కించుకొనేలా లేదు ఈ అమ్మ‌డు. ఇది పొగ‌ర‌నాలో, లేదంటే పొగ‌రుతో కూడిన ఆహంకారంతో వ‌చ్చిన గ‌ర్వం అనాలో టాలీవుడ్‌కీ అర్థం కావ‌డం లేదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.