English | Telugu

'రక్షణ' మూవీ రివ్యూ

'రక్షణ' మూవీ రివ్యూ

సినిమా పేరు: రక్షణ
తారాగణం: పాయల్ రాజ్‌ పుత్, మానస్ నాగులపల్లి, రాజీవ్ కనకాల, చక్రపాణి ఆనంద, రోషన్, శివన్నారాయణ తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్ 
డీఓపీ: అనిల్ బండారి
ఎడిటర్: గ్యారీ
దర్శకుడు, నిర్మాత: ప్రణ్‌దీప్ ఠాకూర్
బ్యానర్:  హరి ప్రియ క్రియేషన్స్
విడుదల తేదీ: జూన్ 7, 2024

పాయల్ రాజ్‌ పుత్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'రక్షణ'. 'ఆర్‌ఎక్స్‌ 100', 'అన‌గ‌న‌గా ఓ అతిథి', 'మంగళవారం' వంటి సినిమాలతో ఆకట్టుకున్న పాయల్.. మొదటిసారి పోలీస్ పాత్రలో నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
కిరణ్(పాయల్ రాజ్‌ పుత్)కు ప్రియ అనే ఫ్రెండ్ ఉంటుంది. ఆమె చదువుల్లో టాపర్.. మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంటుంది. కానీ అనూహ్యంగా కిరణ్ కళ్ళముందే ప్రియ ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. అయితే అది ఆత్మహత్య కాదని, ఆత్మహత్యకు పాల్పడేలా ఎవరో ప్రేరేపించారని కిరణ్ భావిస్తుంది. అదే విషయాన్ని పోలీసులకు చెప్పగా.. వారు పట్టించుకోకుండా సూసైడ్ అని చెప్పి కేసుని కొట్టేస్తారు. ఇక ఏపీసీగా ఛార్జ్ తీసుకున్న తరువాత కిరణ్ కి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. తన ఫ్రెండ్ ప్రియ తరహాలోనే కొందరు అమ్మాయిలు చనిపోతుంటారు. సక్సెస్ ఫుల్ అమ్మాయిలను టార్గెట్ చేసి ఎవరో సైకో ఈ పని చేస్తున్నాడని కిరణ్ భావిస్తుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఆమె మాటలను కొట్టిపారేస్తుంది. అసలు ఆ ఆత్మహత్యల వెనకున్నది ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఆ మిస్టరీని ఛేదించి అతన్ని కిరణ్ పట్టుకోగలిగిందా? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
ఒక నేరం జరగడం.. దాని వెనుక ఎవరున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది ఓ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేసి కనిపెట్టడం. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో సాగే క్రైమ్ థ్రిల్లర్స్ ఇంచుమించు ఇదే టెంప్లేట్ లో నడుస్తాయి. ఈ తరహా ఈ సినిమాలకు కథనమే బలం. ఊహించని మలుపులతో, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ కథనం సాగాలి. నేరస్తుడు రివీల్ అయినప్పుడు ఆడియన్స్ థ్రిల్ ఫీలవ్వాలి. అప్పుడే ఆ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. 'రక్షణ' కూడా ఇంచుమించు అదే టెంప్లేట్ లో నడిచింది. ప్రేక్షకులకు థ్రిల్ ని పంచడంలో ఈ సినిమా బాగానే సక్సెస్ అయింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, దానిని నడిపించిన తీరు మెప్పించాయి. ఆత్మహత్యలు జరగడం, ఏపీసీగా ఛార్జ్ తీసుకొని కిరణ్(పాయల్ రాజ్‌ పుత్) ఎంక్వయిరీ చేయడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. సీన్లను అల్లుకున్న విధానం బాగుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ఇంకా మెరుగ్గా ఉంది. సైకో పాత్రని, అతను సైకోగా మారడం వెనకున్న కథని రివీల్ చేయడం ఆకట్టుకున్నాయి. పతాక సన్నివేశాలు మెప్పించాయి.

సాంకేతికంగానూ చూస్తే.. సాగర్ మహతి సంగీతం ఓకే. పాటలు పెద్దగా మ్యాజిక్ చేయలేదు. నేపథ్య సంగీతం స్టోరీ మూడ్ కి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు పరవాలేదు.

నటీనటుల పనితీరు:
తన గ్లామర్ ఇమేజ్ కి భిన్నంగా చేసిన కిరణ్ అనే పవర్ ఫుల్ పోలీస్ రోల్ పాయల్ రాజ్‌ పుత్ ఆకట్టుకుంది. పోలీస్ పాత్రకి తగ్గట్టుగా ఆవేశాన్ని ప్రదర్శిస్తూనే, ఎమోషన్స్ చక్కగా పలికించింది. బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి ఈ సినిమాలో సర్ ప్రైజ్ చేశాడని చెప్పవచ్చు.రాజీవ్ కనకాల, చక్రపాణి ఆనంద, రోషన్, శివన్నారాయణ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా..
కొత్త పాయల్ రాజ్‌ పుత్ ని చూడాలనుకుంటే 'రక్షణ' సినిమాకి వెళ్ళవచ్చు. క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్: 2.5/5