English | Telugu
రజనీ రూ.50 కోట్లు తీసుకొన్నాడా?
Updated : Nov 17, 2014
దక్షిణాదిన తిరుగులేని కథానాయకుడు రజనీకాంత్! ఒక విధంగా చెప్పాలంటే భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకొనే కథానాయకులలో రజనీ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన సినిమాకి అంతులేని క్రేజ్. దేశ విదేశాల్లోనూ భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొంటాయి. అందుకే రజనీ పారితోషికం కూడా కళ్లు చెదిరే రేంజ్లో ఉంటుంది. లింగకు ఆయన అందుకొన్న పారితోషికం పరిశ్రమ వర్గాల్లో చర్చను లేవనెత్తింది. అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ సినిమా కోసం రజనీ ఏకంగా రూ.50 కోట్లు తీసుకొన్నార్ట. ఈ లెక్కన భారతదేశంలోనే అత్యధిక పారితోషికం రజనీదే అని చెన్నై ఫిల్మ్‌వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రజనీ పారితోషికానికి ఓ లెక్క ఉంటుంది. ఓవర్సీస్, శాటిలైట్ లతో పాటు ఒకట్రెండు ఏరియాల హక్కుల్ని రజనీ తన దగ్గరే ఉంచుకొంటారు. అయితే ఈసారి నగదు రూపంలో పారితోషికం తీసుకొన్నారని, అది రూ.50 కోట్లని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాని ఏరోస్ ఇంటర్నేషనల్ వాళ్లు రూ.160 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. రజనీ సినిమా స్టామినా అది. అందుకే రజనీకి రూ.50 కోట్ల పారితోషికం ఇవ్వడంలో తప్పేం లేదని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకొంటున్నారు.