English | Telugu
నా మాటల్ని తప్పుగా అర్ధం చేసుకోవడం మీ కర్మ అంటున్న రాజేంద్రప్రసాద్
Updated : Jun 2, 2025
నాలుగున్నర దశాబ్దాలపై నుంచి సినీ రంగంలో తన సత్తా చాటుతు వస్తున్న'నటకిరీటి డాక్టర్ 'రాజేంద్రప్రసాద్'(Rajendra Prasad)ఈ నెల 30 న 'షష్టిపూర్తి'(Shashtipoorthi)అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి(Sv Krishna Reddy)జన్మదిన వేడుకలు జరగగా,అందులో రాజేంద్ర ప్రసాద్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, ప్రముఖ నటీనటులు రోజా, నిరోషా, అలీ పై పరుష పదజాలాన్నిఉపయోగించాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు రాజేంద్ర ప్రసాద్ మాటలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ రోజు 'షష్టిపూర్తి' మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సంధర్భంగా తనపై వస్తున్న విమర్శల గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతు 'నేను ఎప్పుడు సరదాగా ఉంటాను. ఆ సరదాతోనే ఇటీవల నేను పరిచయం చేసిన హీరోయిన్, నటుడు ని ఉద్దేశించి మాట్లాడాను. కొంత మంది ఆ మాటల్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఆ విధంగా అర్ధం చేసుకోవడం మీ కర్మ. మీ సంస్కారంపై
కూడా ఆధారపడి ఉంటుంది.
మీడియాని నా కుటుంబంలాగా భావిస్తాను. మీరంతా నన్ను అన్నయ్య అని పిలవడం నా అదృష్టం. ఇండస్ట్రీలో ఎవరకి దక్కని గౌరవం నాకు దక్కింది. నేను ఎప్పుడు నా సినిమాలోని కొత్త వారికి నటన విషయంలో సలహాలు ఇస్తుంటాను. 'షష్టిపూర్తి' మూవీలోని కొత్త వాళ్ళకి కూడా అలాగే సలహాలు ఇచ్చాను. నిజ జీవితంలో సవాళ్ళని ఎలా ఎదుర్కుంటామో, సినిమాల్లోని పాత్రల్లో వచ్చే వాటిని కూడా అలాగే ఎదుర్కొంటాం.సుదీర్ఘ కాలం నుంచి నా పై అభిమానం చూపిస్తున్న వారందరకీ పాదాభివందనం. అని చెప్పుకొచ్చాడు.
