English | Telugu

రాజమౌళి Vs శంక‌ర్‌

ఇది వ‌ర‌కు సౌత్ ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడంటే శంక‌ర్ పేరు చెప్పుకొనేవారు. మ‌గ‌ధీర వ‌రకూ అగ్ర ద‌ర్శ‌కుల జాబితాలో రాజ‌మౌళి ప్ర‌స్తావ‌నే ఉండేది కాదు. రోబోతో యావ‌త్ భార‌తీయ చిత్ర‌సీమని త‌న‌వైపుకు తిప్పుకొన్నాడు శంక‌ర్‌. ఐకి ముందూ ఇంతే! హాలీవుడ్ సినిమాని త‌ల‌ద‌న్నే సినిమా తీసుంటాడ‌ని శంక‌ర్ గురించి ఆశించారు. అయితే.. ఈ సినిమాతో శంక‌ర్ నిరాశ‌పరిచాడు. శంక‌ర్ కూడా ఒక్కోసారి మామూలు ద‌ర్శ‌కుల్లానే త‌ప్పులు చేస్తాడ‌ని ఈ సినిమా నిరూపించింది. దానికి తోడు బాహుబ‌లితో శంక‌ర్‌ని దాటుకొంటూ వ‌చ్చేశాడు రాజ‌మౌళి. తెలుగు సినిమాకి రూ.500 కోట్ల క్ల‌బ్‌లో చేర్చేస్తాడేమో అన్నంత రేంజులో బాహుబ‌లి వ‌సూళ్లు సాగుతున్నాయి. రాజమౌళి హ‌వాతో శంక‌ర్ ప‌ర‌ప‌తి కాస్త త‌గ్గిన మాట వాస్త‌వం. ఈ సంగ‌తి శంక‌ర్‌కీ తెలుసు. అందుకే రోబో 2తో విమ‌ర్శ‌కుల‌కు గ‌ట్టి స‌మాధానం చెప్పాల‌ని నిర్ణ‌యించుకొన్నాడ‌ట‌.

రోబో 2ని భార‌తీయ చ‌ల‌న చిత్ర‌ప‌రిశ్ర‌మ క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా రూపొందించాల‌ని శంక‌ర్ గట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. ఈ సినిమా కోసం రూ.250 కోట్ల బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అటు త‌మిళ వ‌ర్గాలనే కాదు, యావ‌త్ భార‌తీయ చ‌ల‌న చిత్ర‌సీమ‌నూ షాక్‌కి గురిచేస్తున్నాయి. బాహుబ‌లి రెండు భాగాల‌కూ పెట్టిన పెట్టుబ‌డి అది. ఒక్క సినిమాకే శంక‌ర్ రూ.250 కోట్లు ఖ‌ర్చు పెట్టాల‌ని చూడ‌డం.. అత‌ని గ‌ట్స్‌కి నిద‌ర్శ‌నం. అయితే బాహుబ‌లి వేరు, రోబో 2 వేరు! బాహుబ‌లి స్ట్రాట‌జీ వేరు, రోబో 2 వేరు. అయితే ఈ లెక్క‌లేం ప‌ట్టించుకోకుండా శంక‌ర్ భారీ మొత్తంతో ఈ సినిమా తీయ‌డం ప‌రిశ్ర‌మ‌కు షాక్‌కి గురిచేసే విష‌యమే.

సినిమాలో ద‌మ్ముంటే ఎన్ని వ‌సూళ్ల‌యినా సాధించుకోవ‌చ్చ‌ని బాహుబ‌లి నిరూపించింది. బాహుబ‌లి స్ఫూర్తితోనే శంక‌ర్ కూడా ఈ సాహ‌సానికి ఒడిగ‌డుతున్నాడు. మ‌రి ఈ సినిమాతో శంక‌ర్ రాజ‌మౌళికి పోటీ ఇస్తాడా? మ‌ళ్లీ సౌత్ ఇండియా నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడిగా కితాబులు అందుకొంటాడా?? వేచి చూడాల్సిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.