English | Telugu

బ‌న్నీ, అజిత్‌తో రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌??

టాలీవుడ్‌కి ఇది దిమ్మ‌తిరిగిపోయే న్యూస్ ఇది. బాహుబ‌లి 2 త‌ర‌వాత రాజ‌మౌళి ఎవ‌రితో సినిమా చేస్తాడ‌న్న విష‌యంలో దాదాపుగా ఓ క్లారిటీ వ‌చ్చింది. ఈసారి రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌డానికి స్కెచ్ వేస్తున్నాడ‌ట‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందే ఈ చిత్రంలో క‌థానాయ‌కులుగా అల్లు అర్జున్‌, అజిత్‌ల‌ను ఎంచుకొన్నాడ‌ట‌.

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ రాసిన క‌థ ఇద్ద‌రు హీరోల్ని డిమాండ్ చేస్తోంద‌ని టాక్‌. తెలుగులో బ‌న్నీ, త‌మిళంలో అజిత్ ల వ‌ల్ల ఈ సినిమా మార్కెట్ అనూహ్యంగా పెరుగుతుంద‌ని రాజ‌మౌళి ప్లాన్‌. సెప్టెంబ‌రులో బాహుబ‌లి 2 మొద‌లువుతుంది. 2016 వేస‌విలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ త‌ర‌వాత ఈ మ‌ల్టీస్టార‌ర్ ని సెట్స్‌పైకి తీసుకెళ్తార‌ని టాక్‌.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.