Read more!

English | Telugu

సస్పెన్స్ డ్రామాగా రాజ్ తరుణ్ కెరీర్...!


రాజ్ తరుణ్ కెరీర్ ఓ సస్పెన్స్ డ్రామాను తలపిస్తోంది. ఒక సినిమా సైన్ చేశాడు అని వార్త వచ్చేలోపే మరో సినిమా ఆగిపోయింది అని వార్తలొస్తున్నాయి. ఇవాళ పొద్దుటే లేడీ డైరెక్టర్ తో రాజ్ తరుణ్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ అనే వార్త వచ్చింది. ఆ వార్త చదవడం పూర్తి చేసేలోపే ఇప్పుడు రాజ్ తరుణ్ మరో సినిమా ఆగిపోయిందని వార్తలొస్తున్నాయి.
విషయం ఏంటంటే.. రాజ్ తరుణ్ కథానాయకుడిగా "ఎకె ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ లో "దొంగాట" ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది. రాజ్ తరుణ్ స్క్రిప్ట్ విషయంలోనే కాక షూటింగ్ టైమ్ లో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ను బాగా కెలుకుతున్నాడని, అందువల్ల దర్శకుడు రాజ్ తరుణ్ పోరు పడలేక "నేను చేయలేను" అంటూ బయటకొచ్చేశాడని సమాచారం. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకొంటున్న రాజ్ తరుణ్ పై ఇలాంటి వార్తలు రావడం అతడి కెరీర్ ను కష్టాల్లో పడేయడం ఖాయం.