English | Telugu
రాంగోపాల్ వర్మపై కుర్ర హీరో సెటైర్లు
Updated : Nov 6, 2015
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న రాజ్ తరుణ్ ..నిన్న అర్ధరాత్రి దాటాక సెన్సేషనల్ కామెంట్లతో ట్విట్టర్ని వేడెక్కించాడు . ''వర్మతో సినిమా చేయబోతున్నా. అతను జస్ట్ ఓకే ఓకే డైరెక్టర్. అతడికి నేను పెట్టిన పెట్ నేమ్ అప్పారావు''.. ''నేను డైరెక్టర్ అయి ఉంటే రంగీలా, శివ కంటే చాలా బెటర్ సినిమాలు చేసి ఉండేవాణ్నని నిజాయితీగా ఫీలవుతున్నా''.. ''ఆర్జీవీ జస్ట్ 'ఓకే' డైరెక్టర్ అయినప్పటికీ అతడితో సినిమా ఎందుకు చేస్తున్నానంటే.. నేనతడి తప్పుల్ని సరిదిద్దగలననే''.. ఇలా వరుసగా మూడు ట్వీట్లు గుప్పించాడు రాజ్ తరుణ్. కొసమెరుపు ఏంటంటే.. ఈ ట్వీట్లపై వర్మ కూడా స్పందించాడు. ‘‘రాజ్ తరుణ్ నటుడిగా కంటే దర్శకుడిగా నాకన్నా పూరి జగన్నాథ్ - వి.వి.వినాయక్- రాజమౌళి తదితరులకన్నా సామర్థ్యం ఉన్నవాడని నిజంగా నమ్ముతున్నా’’ అన్నాడు వర్మ.