English | Telugu

హ్యాట్స్ ఫ్ లారెన్స్..!

చెన్నైలో లో బీభత్సం సృష్టించిన వరదలకు ఎందరో నిరాశ్రయులు కాగా వారికి కోలీవుడ్ హీరోలే కాక కొందరు టాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు సాయాన్ని అందించారు. అయితే సూపర్ స్టార్స్ మంటూ కోట్ల కొద్దీ రెమ్యూనిరేషన్స్ తీసుకున్న హీరోలు ఐదు పది పదిహేను లక్షలు విదిలిస్తుంటే లారెన్స్ మాత్రం కోటి రూపాల ఆర్థిక సాయాన్నిచేసి తన గొప్ప మనసుని మరో మారు చాటుకున్నారు. నటుడిగా , కొరియోగ్రాఫర్ గా , డైరెక్టర్ గా మంచి సక్సెస్ లను అందుకున్న లారెన్స్ తన స్థాయికి మించి ఇంత మొత్తంలో విరాళం ప్రకటించడం చాలా అభినందనీయం. గతంలో కూడా నిరుపేదల విద్య కోసం లారెన్స్ కోటి రూపాయల విరాళాన్ని అందించారు. లారెన్స్ నువ్వు నిజంగానే గ్రేట్ అయ్యా.. హ్యాట్స్ ఫ్!!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.