English | Telugu
ఫేక్ కరెన్సీ క్రియేట్, దేశం అద్దెకి..అసలు నిజం ఏంటి పూరి జగన్నాధ్
Updated : May 10, 2025
పూరీ జగన్నాధ్(Puri Jagannadh)ప్రస్తుతం మక్కల్ సెల్వన్ 'విజయ్ సేతుపతి'(VIjay Sethupathi)తో సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కి వెళ్లనుండగా,మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం తెరకెక్కనుండగా పూరి, ఛార్మి కౌర్(Charmy Kaur)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
పూరి చాలా కాలం నుంచి సోషల్ మీడియా వేదికగా 'పూరి మ్యూజింగ్స్'(Puri Musings)ని నిర్వహిస్తు పలు ఆసక్తికర విషయాలని ప్రేక్షకులతో పంచుకుంటు ఉంటాడనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా 'పూరి మ్యూజింగ్స్' లో మాట్లాడుతు'లిక్టెన్ స్టైన్'(Liechtenstein)అనే దేశం నలభై వేల మంది జనాభాతో నూట అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఎన్నో దేశాల విమానాశ్రయాల కంటే చిన్నదైన ఈ దేశం స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉంది. ముప్పై నిమిషాల్లో లిక్టెన్ స్టైన్ దేశం మొత్తాన్నికారులో చుట్టేయచ్చు. వాళ్ళకి అగస్ట్ 15 నేషనల్ డే. పండుగలతో పాటు ఇతర ప్రత్యేక రోజుల్లో అక్కడి ప్రజలు సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు.
డెభై వేల డాలర్స్ చెల్లించి మనం ఈ దేశాన్ని అద్దెకి తీసుకోవచ్చు. రెడ్ కార్పెట్ తో ఆ దేశం మనకి స్వాగతం పలుకుతుంది. రాయల్ ప్యాలస్ లో వసతి ఏర్పాటు చేస్తారు. స్ట్రీట్ బోర్డు మీ పేరు మీదే వెలుస్తాయి. ఒక రాజులాగా ట్రీట్ చెయ్యడమే కాకుండా మన ఫొటోతో ఫేక్ కరెన్సీ ని క్రియేట్ చేస్తారు. దాంతో మీరు అక్కడ ఏది కావాలనుకునే అది కొనుక్కోవచ్చని చెప్పాడు.
