English | Telugu
సింగిల్ మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్
Updated : May 10, 2025
శ్రీవిష్ణు(Sri vishnu)హీరోగా నిన్నప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'సింగిల్'(Single). రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో కేతిక శర్మ(Kethika sharma)ఇవానా(Ivana)హీరోయిన్లుగా జత కట్టారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్ రియాజ్ చౌదరి నిర్మించగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు.
ఈ మూవీ తొలిరోజు 4 .15 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సాధించి, చాలా రోజుల తర్వాత చిన్నచిత్రాల్లో డే 1 అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో, రాబోయే రోజుల్లో రికార్డు కలెక్షన్స్ సాధించడం పక్కా అని సినీ ట్రేడ్ వర్గాలు వారు అంటున్నారు. రీసెంట్ గా సింగిల్ సాధించిన విజయంపై అల్లు అరవింద్ మాట్లాడుతు ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా మా సినిమాని రిలీజ్ చెయ్యాలా లేదా అని అనుకున్నాం. కానీ ప్రజలు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి సినిమాని నమ్ముకున్న వాళ్ళు, సినిమా మీద ఆధారపడిన వాళ్ళకి నష్టం కలగ కూడదని సింగల్ ని రిలీజ్ చేసాం. మా నమ్మకం నిజమయ్యి ప్రేక్షకులు సినిమాని సూపర్ హిట్ చేసారు.
శ్రీ విష్ణు చెప్పిన డైలాగ్స్ ని ప్రేక్షకులు థియేటర్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ మెంట్ లో డైలాగ్స్ అర్ధం కాక రెండో సారి కూడా సినిమా చూస్తున్నారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్, కేతిక శర్మ, ఇవానా కూడా మాట్లాడుతు సినిమాని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియచేసారు.
