Read more!

English | Telugu

ప్రియాంక వందకోట్లకు టెండర్ పెట్టింది..!

ఏ ముహూర్తాన హాలీవుడ్ లో అడుగుపెట్టిందో కానీ, ప్రియాంక చోప్రాకు ఆ తర్వాతి నుంచి వరసగా అదృష్టం తలుపు తడుతూనే ఉంది. ఇప్పటికే క్వాంటికో తో అమెరికాలో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు బేవాచ్ సినిమాలో విలన్ గా చేసిన ఈ భామ, ఈ మధ్యే కాస్త సెలవు దొరకడంతో, ఒక 40 రోజుల పాటు ఇండియాకు చుట్టం చూపులా వస్తోంది. విచిత్రమేంటంటే, ఈ కాస్త గ్యాప్ లో కూడా అమ్మడు వందకోట్లు సంపాదించే ప్లాన్ వేసింది. ఇండియాలో ఆ టైం లో దాదాపు 24 సంస్థల యాడ్స్ అండ్ కమర్షియల్స్ ను షూట్ చేయబోతోందట. ఈ మొత్తం షూట్స్ కు మిస్ చోప్రా గారు తీసుకునే ఎమౌంట్ వందకోట్ల వరకూ ఉంటుందట. కేవలం 40 రోజుల్లో వంద కోట్లు సంపాదించడమా అంటూ బాలీవుడ్ జనాలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి స్టార్ అలా ఉంది మరి. ఇవి కాక త్వరలోనే ఆమె జేమ్స్ బాండ్ సినిమాలో నటించే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఇంతకీ మన సినిమాలు ఎప్పుడు చేస్తావు బేబీ అని అడిగితే, నాకు ఆలోచించుకునే టైం కూడా ఉండట్లేదు. త్వరలోనే క్లారిటీ ఇస్తా అంటోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే ఏంటో ప్రియాంక చోప్రాను చూసి నేర్చుకోవాలేమో.