Read more!

English | Telugu

చందమామ కెరీర్ చివరికి వచ్చేసిందా...?

ఇండస్ట్రీల్లో హీరోల కెరీర్ దశాబ్దాల పాటు సాగుతుంటుంది. కానీ హీరోయిన్ల విషయం అలా కాదు. ఉండేకొద్దీ హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు దశాబ్దాల పాటు నిరంతరాయంగా సాగిన వీళ్ల కెరీర్లు, నేడు మాత్రం దశాబ్దం ఉంటే ఎక్కువే. ఆ దశాబ్ద కాలంలోనైనా, హిట్టు సినిమాలుంటేనే దిక్కు. హిట్స్ లేకపోతే, నాలుగైదేళ్లకు మించి కెరీర్ నడవదు. ఈ రెండు లిమిట్స్ నూ దాటేసింది చందమామ కాజల్. ఇండస్ట్రీలోకి ఎంటరై దశాబ్దం అయిపోయింది. పైపెచ్చు ఇప్పుడు వరస ఫ్లాపులు. చివరిగా టెంపర్ లో కళకళలాడుతూ కనిపించిన కాజల్, సర్దార్,  బ్రహ్మోత్సవం సినిమాల్లో పూర్తి కళతప్పింది. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు కానీ, అమ్మాయిగారి ముఖంలో కాంతి పూర్తిగా మాయమైంది. ఇద్దరు స్టార్స్ నటిస్తున్న రెండు భారీ సినిమాల్లో ఒకే సీజన్లో హీరోయిన్ గా వస్తుండటంతో, ఈ దెబ్బతో కెరీర్ మళ్లీ ట్రాక్ ఎక్కేస్తుందని నమ్మకం పెట్టుకుంది. అయితే ఆ రెండూ బ్యాక్ ఫైర్ అవడంతో, ఈ అమ్మడి కెరీర్ అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం హిందీలో దో లఫ్జోంకీ కహానీ తప్పితే, కాజల్ దగ్గర కొత్త ప్రాజెక్ట్ లేమీలేవు. ఈ సినిమా అయినా హిట్ అయితే, ఈ భామ కెరీర్ కాస్త నిలబడుతుంది. లేదంటే ఇక తెర పడినట్లే అంటున్నారు సినీజనాలు.