English | Telugu

బెంగుళూరులో ప్రియమణికి కారు యాక్సిడెంట్

ప్రముఖ హీరోయిన్ ప్రియమణికి బెంగుళూరులో కారుప్రమాదం జరిగిందట. మళయాళంలో సూపర్ హిట్టయిన "బాడీ గార్డ్" అనే చిత్రం సూపర్ హిట్టయింది. ఈ చిత్రాన్ని తమిళంలో విజయ్ హీరోగా, హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేయగా, ప్రస్తుతం తెలుగులో విక్టరీ వేంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

"బాడీ గార్డ్"కి కన్నడ భాషలో రీమేక్ అయిన "అన్నా బాండ్" చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తూంది. ఈ చిత్రం షూటింగ్ కోసం వెళుతూంటేనే ఈ యాక్సిడెంట్‍ జరుగిందని సమాచారం. ఈ ప్రమాదంలో కారు బాగా డామేజ్ అయినా అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారెవ్వరికీ గాయాలు కాకపోవటం విశేషం.