English | Telugu

మోడీ ప్ర‌భాస్‌ని వాడుకోంటారా?

మోడీ - ప్ర‌భాస్ ల క‌ల‌యిక సినీ వ‌ర్గాల్లోనే కాదు, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిని పెంచుతోంది. కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తావిస్తోంది. ప్ర‌భాస్ క‌లుసుకొంది సినిమా (సొంత‌) `ప‌బ్లిసిటీ` కోస‌మే అయినా... వీటి వెనుక రాజ‌కీయ ఎత్తుగ‌డ కూడా ఉంద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. తెలుగునాట బ‌లం పుంజుకోవ‌డానికి బీజేపీ గ‌త ఎన్నిక‌ల నుంచీ గట్టి ప్ర‌ణాళిక‌లు వేసుకొంది. తెలుగునాట తిరుగులేని స్టార్ గా వెలుగొంతుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ చేత జై మోడీ అనిపించారు. ఇప్పుడు వ‌వ‌న్ ఇటు తెదేపాకి, అటు బీజేపీకి స‌లాం కొట్టేసే స్థితికి వ‌చ్చేశాడు. ఈ ద‌శ‌లో బీజేపీకి సినీ గ్లామ‌ర్ అత్య‌వ‌స‌రం. అందుకే.. వాళ్ల ప్లాన్‌లు వాళ్ల‌కున్నాయి.

ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజు బీజేపీ హ‌యాంలో కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు ఆ పార్టీపై ఇప్ప‌టికీ న‌మ్మ‌కం ఉంది. అటు బీజేపీ కూడా కృష్ణంరాజుని వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ప్ర‌బాస్ పాపులారిటీ కూడా వాళ్ల‌ను ఆకర్షిస్తోంది. బాహుబ‌లితో తెలుగునాటే కాదు, బాలీవుడ్‌లోనూ ప్ర‌భాస్ ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఈ ద‌శ‌లో ప్ర‌భాస్‌ని మ‌చ్చిక చేసుకోవ‌డం బీజేపీకి క‌లిసొచ్చే అంశ‌మే. ఇప్పుడు కాక‌పోయినా... అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భాస్‌ని వాడుకోవ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.

పెద‌నాన్న కోసం ప్ర‌భాస్ కూడా బీజేపీకి మ‌ద్ద‌తుగా త‌న గ‌ళం వినిపించే అక‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌వ‌న్ జ‌న‌సేన త‌ర‌పున త‌న బ‌ల‌గాన్ని ఎన్నిక‌ల బ‌రిలో దింపే ఛాన్సుంది. అందుకే ప్ర‌భాస్‌ని అడ్డం పెట్టుకొని తెలుగునాట కావ‌ల్సినంత ప్ర‌చారం చేసుకోవాల‌ని మోడీ అండ్ కో ఆలోచిస్తోంది. మ‌రి ఇవన్నీ జ‌రుగుతాయా? ఈసారి ప్ర‌భాస్‌ని మోడీ ఎంత వ‌ర‌కూ వాడుకొంటాడు? మోడీకి ప్ర‌భాస్ ఎంత వ‌ర‌కూ స‌హాయ‌ప‌డ‌తాడు? చూడాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల సీజ‌న్ వ‌రకూ ఆగాల్సిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.