Read more!

English | Telugu

ప్రభాస్ లవ్ కి ముహూర్తం కుదిరింది..స్వయంగా తనే చెప్పబోతున్నాడు 

పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ కల్కికి ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టే.జూన్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో ప్రభాస్ నెక్స్ట్ ఏ మూవీలో చేస్తాడనే  ఆసక్తి అందరిలో ఉంది.ప్రశాంత్ నీల్ సలార్ 2 ,సందీప్ రెడ్డి  స్పిరిట్ లాంటి చిత్రాలు లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు హను రాఘవపూడి సినిమా కూడా ఉంది. వీటిల్లో ముందుగా  షూటింగ్ కి వెళ్లబోయే మూవీ ఏంటో తెలిసింది


హను రాఘవపూడి మూవీ జులై నుంచి షూట్ కి వెళ్లబోతుంది. ఈ మేరకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. ప్రేమ ప్రధానంగా సాగే ఒక పీరియాడిక్ సబ్జట్ తో తెరకెక్కబోతుంది.ఈ మేరకు పూర్తి స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. అలాగే  హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయ్యింది. ఒక టాప్ హీరోయిన్ డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. త్వరలోనే మేకర్స్ ఆమె ని అధికారకంగా ప్రకటిస్తారు. ఒక పక్కన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా  జరుగుతున్నాయి. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ  మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది

 ఇప్పుడు  సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త ప్రభాస్ అభిమానులని విశేషంగా ఆకరిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఎప్పటినుంచో ప్రభాస్ ఒక లవ్ మూవీ చెయ్యాలని కోరుకుంటున్నారు. వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు వాళ్ళ మైండ్ నుంచి పోవడం లేదు. పైగా ప్రేమ చిత్రాల స్పెషలిస్ట్  హను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటంతో ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడనే  క్యూరియాసిటీ  కూడా వాళ్ళల్లో  ఉంది. ఆయన గత మూవీ సీతారామం ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరకి తెలిసిందే. సో  ప్రభాస్ ప్రేమ ముహూర్తం జులై లో ప్రారంభం కానుంది.