English | Telugu

చరణ్ తో మరోసారి తమిళ అగ్ర దర్శకుడు!..అతను కాకపోతే ఫ్యాన్స్ ఊరుకుంటారా!

చరణ్ తో మరోసారి తమిళ అగ్ర దర్శకుడు!..అతను కాకపోతే ఫ్యాన్స్ ఊరుకుంటారా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం 'బుచ్చిబాబు'(Buchibabu)దర్శకత్వంలో 'పెద్ది'(Peddi)మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రీవియస్ మూవీ 'గేమ్ చేంజర్' పరాజయంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలనే పట్టుదలతో చరణ్ 'పెద్ది' మూవీ చేస్తున్నాడు. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను 'పెద్ది' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఆ అంచనాలకి తగ్గట్టుగానే ఉన్నాయి.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా, 'పెద్ది' తర్వాత సుకుమార్(Sukumar)దర్శకత్వంలో చరణ్ తన తదుపరి మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది.


సుకుమార్ మూవీతో పాటు, చరణ్ ఒక తమిళ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సదరు తమిళ దర్శకుడు చరణ్ తో చర్చలు జరుపుతున్నాడని, చరణ్ అతనితో మూవీ చెయ్యడం పక్కా అని అంటున్నారు. దర్శకుడు పేరు మాత్రం బయటకి  రాలేదు. దీంతో మెగా అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. మన తెలుగు హీరోలకి తమిళ దర్శకులతో సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ. గేమ్ చేంజర్ రిజల్ట్ కళ్ళ ముందు కనపడుతూనే ఉంది.శంకర్ లాంటి  బిగ్ డైరెక్టర్ చేస్తేనే ఫలితం బెడిసి కొట్టిందని, కాబట్టి తమిళ దర్శకులకి చరణ్ దూరంగా ఉండాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు.

కాకపోతే కొంత కాలంనుంచి ప్రస్తుతం తమిళ అగ్ర దర్శకుడిగా ఉన్న 'లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj)తో చరణ్ ఒక మూవీ చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు వినిపిస్తున్న తమిళ  దర్శకుడి పేరు లోకేష్ కనగరాజ్ అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ లో జోష్ వస్తుంది. ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కించడంలో లోకేష్ కనగరాజ్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన గత చిత్రాలైన ఖైధీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలే ఉదాహరణ. ప్రస్తుతం రజనీకాంత్(Rajinikanth),నాగార్జున(Nagarjuna)తో 'కూలీ'(Coolie)చేస్తున్నాడు.